
ఏఆర్ మురుగదాస్‌కు దర్శకుడిగా చిన్న గ్యాప్ వచ్చింది. రజనీకాంత్ హీరోగా ఈయన చేసిన దర్బార్ చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. విజయ్‌తో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ చిత్రం చేయబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఆర్ మురుగదాస్ చిత్ర నిర్మాణాన్ని పునః ప్రారంభించారు. పీపుల్ బుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి 1947 ఆగస్టు 16 అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్ర పోరాట కాలంలో ఒక గ్రామీణ యువకుడు బ్రిటీష సైన్యంతో పోరాడే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. భావోద్వేగాలతో కూడిన సంఘటనలతో, ప్రేమను కలిపిన ఎంటర్‌టైన్‌మెంట్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సలహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment