అదిరిపోయిన ‘దర్బార్‌’ ట్రైలర్‌ | Rajinikanth Darbar Trailer Out | Sakshi
Sakshi News home page

అదిరిపోయిన ‘దర్బార్‌’ ట్రైలర్‌

Published Mon, Dec 16 2019 8:29 PM | Last Updated on Mon, Dec 16 2019 10:25 PM

Rajinikanth Darbar Trailer Out - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్‌’. ఈ చిత్రం ట్రైలర్ సోమవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.‘ వాడు పోలీసాఫీసరా సర్..హంతకుడు​’, ‘ఆదిత్యా అరుణాచలం కమిషనర్ ఆఫ్ ముంబై’ అనే డైలాగులతో షురూ అయ్యే ట్రైలర్ రజనీ అభిమానులను అలరించేలా ఉంది. ‘ఆ చూపేంటి..ఒరిజిల్‌ గానే విలనమ్మా..ఇదేలా ఉంది’, ‘ ఐయామ్‌ ఏ బ్యాడ్‌ కోప్‌’  అంటూ రజనీకాంత్‌ చెప్పే సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. 

ద‌ర్భార్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమ‌కూరుస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement