డైరీలో ఖాళీ ఇల్లే! | Rajinikanth plays a police officer in AR murugadas film | Sakshi
Sakshi News home page

డైరీలో ఖాళీ ఇల్లే!

Published Sun, Apr 14 2019 12:28 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Rajinikanth plays a police officer in AR murugadas film - Sakshi

రజనీకాంత్‌

వేగం పెంచారు రజనీకాంత్‌. అరవైలలో ఇరవైల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక సినిమా పూర్తి కావడం ఆలస్యం మరో సినిమా సైన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ‘దర్బార్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే స్టార్ట్‌ అయింది. అప్పుడే ఈ ప్రాజెక్ట్‌ తర్వాత చేయబోయే రెండు సినిమాలకు డేట్స్‌ ఇచ్చేశారట రజనీ.

తనకు ‘ముత్తు, నరసింహ’ వంటి హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ, ‘చతురంగవైటై్ట, ఖాకీ’ వంటి హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు హెచ్‌. వినోద్‌తో మరో సినిమా అంగీకరించారట. ఈ మూడు సినిమాలతో రజనీ డైరీ 2021 వరకూ ఖాళీ ఇల్లే (లేదు). ఈ సినిమాలు పూర్తయిన తర్వాత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే ఆలోచనలో రజనీ ఉన్నట్టు తమిళనాడు టాక్‌. ‘దర్బార్‌’ 2020 సంక్రాంతికి రిలీజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement