Viraj Ashwin
-
అనంత శ్రీరామ్‌కు ఐఫా అవార్డు
పాటల రచయిత అనంత శ్రీరామ్ ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డు అందుకున్నారు. ‘బేబి’ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికిగానూ ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు బెస్ట్ లిరిక్ రైటర్‌గా అనంత శ్రీరామ్ తాజాగా ఐఫా అవార్డు అందుకోవడంతో ఎస్కేఎన్, సాయి రాజేశ్ కలిసి అనంత శ్రీరామ్‌ను అభినందించారు. ‘‘బేబి’ మూవీకి ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. తాజాగా ఐఫా దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నాయంటే ఆ ఘనత సాయి రాజేశ్‌కే దక్కుతుంది. ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించారాయన’’ అని మేకర్స్ తెలిపారు. కాగా ఎస్కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్లో ‘బేబి’ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. -
‘శ్రీరంగ నీతులు’ మూవీ రివ్యూ
టైటిల్: శ్రీరంగ నీతులు నటీనటులుః సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్, కిరణ్, రాగ్ మయూర్, దేవి ప్రసాద్ తదితరులు నిర్మాణ సంస్థ: రాధావి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి దర్శకుడు: ప్రవీణ్ కుమార్ సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: టీజో టామీ శ్రీరంగ నీతులు కథేంటంటే.. ఈ సినిమా కథంతా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. బస్తీకి చెందిన శివ(సుహాస్) టీవీ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అతనికి ఫ్లెక్సీల పిచ్చి. బతుకమ్మ సందర్భంగా ఆ ఏరియాలోని గ్రౌండ్లో ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోతో ఫ్లెక్సీ కట్టిస్తాడు. అయితే దాన్ని రాత్రికి రాత్రే ఎవరో మాయం చేస్తారు. మరో ప్లెక్సీ కట్టించడానికి డబ్బులు ఉండవు. ఎలాగైన పండక్కి గ్రౌండ్లో తన ప్లెక్సీ ఉండాలనుకుంటాడు. దాని కోసం శివ ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? మరోవైపు వరుణ్(విరాజ్ అశ్విన్), ఐశ్వర్య(రుహానీ శర్మ) ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది ఐశ్వర్య. పెళ్లి చేసుకుందామని వరుణ్ పదే పదే అడగడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు రెడీ అవుతుంది. ఇంతలోపు ఆమె తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. వారికి అమ్మాయి నచ్చడంతో త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమ విషయాన్ని చెప్పలేక, పెద్దలు చూసిన సంబంధం చేసుకోలేక సతమతమవుతారు. దీంతో పాటు ఐశ్వర్యకు మరో సమస్య వస్తుంది. ఆది ఏంటి? చివరకు వరుణ్, విరాజ్‌లు పెళ్లి చేసుకున్నారా లేదా? ఇంకోవైపు ఉన్నత చదువులు చదివిన కార్తిక్(కార్తీక్ రత్నం) డ్రగ్స్‌కి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిసి అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు తీరుగుతుంటారు. కొడుకును పోలీసులకు చిక్కకుండా కాపాడుకునే క్రమంలో తండ్రి(దేవీ ప్రసాద్) చిక్కుల్లో పడతాడు. చివరకు తండ్రిని కూడా పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? కార్తిక్ డ్రగ్స్‌కు ఎందుకు బానిసయ్యాడు? చివరకు ఈ ముగ్గురి జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. అలాంటి వారికి ఒక్క చాన్స్ ఇస్తే వారి తప్పులను తెలుసుకొని మారిపోయే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని ‘శ్రీరంగ నీతులు’ సినిమా ద్వారా చెప్పాడు దర్శకుడు ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్. అలాగే నేటి యువత చేస్తున్న ప్రధాన తప్పులను మూడు పాత్రల రూపంలో చూపిస్తూ.. చివర్లో మంచి సందేశాన్ని ఇచ్చాడు. పేరు కోసం ఒకరు.. పరువు కోసం మరోకొరు.. ఫెయిల్యూర్ని తీసుకోకుండా పెడదారి పట్టేది ఇంకొకరు.. వీరంతా అలా ప్రవర్తించడానికి కారణం సమాజమే. ఇతరులను నిందించడం మానేసి వారికొక అవకాశం ఇస్తే మార్పు వస్తుందని ఈ కథ తెలియజేస్తుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ.. తెరపై దాన్ని క్లారిటీగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ప్రధాన పాత్రల ప్రవర్తన విషయంలో క్లారిటీ మిస్ అయింది. శివకి ప్లెక్సీ అంటే ఎందుకంత ఇష్టం? ఉన్నత చదవులు చదివిన కార్తిక్ ఎందుకు డ్రగ్స్‌కి బానిసయ్యాడు? అనేది ఇంకాస్త క్లారిటీగా చూపిస్తే బాగుండేది. ఆ పాత్రల్లో వచ్చిన మార్పుకు గల కారణం కూడా బలంగా లేదు. అయితే ఈ రెండు పాత్రలు వాస్తవికానికి దగ్గరగా ఉంటాయి. ఇప్పటి యువతకి..ముఖ్యంగా ఊరు, బస్తీల్లో ఉండేవారికి ప్లెక్సీల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. పండగ వేళల్లో రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలతో హడావుడి చేస్తుంటారు. ఇదే విషయాన్ని శివ పాత్ర రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్‌ల పాత్రల ద్వారా ఈ తరం ప్రేమికులు పడుతున్న ఇబ్బందులను చూపించారు. టాలెంట్ ఉన్నా.. సరైన గైడెన్స్ లేక, ఫెయిల్యూర్ సమయంలో భుజం తట్టి అండగా నిలిచేవారు లేక యువత ఎలా పెడదారిన పడుతున్నారనేది కార్తీక్ రత్నం పాత్ర ద్వారా చూపించాడు. అయితే ఈ మూడు కథల మెసేజ్ బాగున్నప్పటికీ కథనం స్లోగా సాగడంతో సాగదీతగా అనిపిస్తుంది. కథలో పెద్దగా మలుపులు, ట్విస్టులు ఉండవు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు పోషించినవారంతా సహజ నటనతో ఆకట్టుకున్నారు. బస్తీకి చెందిన శివ పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. ఇక డ్రగ్స్‌కి బానిసైన కార్తిక్‌గా కార్తిక్ రత్నం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అతని సంభాషణలు తక్కువే అయినా.. గుర్తిండిపోతాయి. కార్తిక్ తండ్రి పాత్రకి దేవి ప్రసాద్ న్యాయం చేశాడు. ప్రేమ జంట వరుణ్-ఐశ్వరగా విరాజ్ అశ్విన్, రుహానీ శర్మలు చక్కగా నటించారు. కిరణ్, రాగ్ మయూర్, తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్యం సంగీతం, సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ
'బేబి' సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విరాజ్ అశ్విన్. ఈ మూవీ తర్వాత అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జోరుగా హుషారుగా. అనుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పూజిత పొన్నాడ హీరోయిన్గా యాక్ట్ చేసింది. నిరీష్ తిరువిధుల నిర్మించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 15న విడుదలైంది. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీతోపాటు తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇది థియేటర్లలో పెద్దగా వర్కవుట్ కాలేదు. తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే.. సంతోష్ (విరాజ్ అశ్విన్) సాఫ్ట్వేర్ ఉద్యోగి. తండ్రి (సాయికుమార్) రూ.20 లక్షల అప్పు తీర్చేందుకు తెగ కష్టపడతాడు. సంతోష్ బాస్ ఆనంద్ (మధు నందన్)కు 35 ఏళ్లొచ్చినా పెళ్లి కాలేదు. ఇంతలో హీరో ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ).. చెప్పాపెట్టకుండా ఇతడి ఆఫీసులోనే జాయిన్ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో బాస్.. ఆమెతో ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగింది? సంతోష్ అప్పు తీర్చాడా? తన లవ్‌స్టోరీ సాఫీగా ముందుకు వెళ్లిందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: ‘యాత్ర 2’ టాక్ ఎలా ఉందంటే.. సంగీత దర్శకుడు కన్నుమూత, వందకు పైగా సినిమాలకు.. -
'జోరుగా హుషారుగా' సినిమా రివ్యూ
టైటిల్: జోరుగా హుషారుగా నటీనటులు: విరాజ్ అశ్విని, పూజిత పొన్నాడ, సాయికుమార్, సిరి హనుమంతు తదితరులు సంగీతం: ప్రణీత్ సినిమాటోగ్రఫీ: పి.మహిరెడ్డి నిర్మాత: నిరీష్ తిరువీధుల దర్శకుడు: అనుప్రసాద్ విడుదల: 2023 డిసెంబరు 15 (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ) కథేంటి? సంతోష్ (విరాజ్ అశ్విన్).. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తండ్రి (సాయికుమార్).. రూ.20 లక్షల అప్పు తీర్చేందుకు సంతోష్ తెగ కష్టపడుతుంటాడు. ఇకపోతే సంతోష్ బాస్ ఆనంద్(మధు నందన్)కి 35 ఏళ్లొచ్చినా సరే ఇంకా పెళ్లి కాదు. దీంతో ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. సంతోష్ ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ).. ఏం చెప్పకుండా ఇతడి ఆఫీస్‌లోనే జాయిన్ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో బాస్ ఆనంద్.. సంతోష్ లవర్‌తో ప్రేమలో పడతాడు. మరి చివరకు ఏమైంది? సంతోష్.. తన ప్రేయసి గురించి అసలు నిజం బయటపెట్టాడా? తండ్రి అప్పు తీర్చాడా అనేది 'జోరుగా హుషారుగా' మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? 'బేబి' మూవీలో ఓ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విని.. 'జోరుగా హుషారుగా' అనే ఎంటర్టైనింగ్ మూవీతో సోలోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే ఈ సినిమా రెగ్యులర్ రొటీన్ స్టఫ్‌తోనే తీశారు. చెప్పాలంటే ఇదో రెగ్యులర్ లవ్ స్టోరీ. కాకపోతే తండ్రి అనే ఎమోషన్ జోడించి తీశారు. అయితే అటు ప్రేమకథ గానీ, ఇటు ఫాదర్ ఎమోషన్ గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. (ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?) ఫస్టాప్ విషయానికొస్తే.. సంతోష్‌గా విరాజ్ అశ్విన్ ప్రపంచం, అతడి ప్రేమకథ, ఆఫీస్ వాతావరణాన్ని పరిచయం చేస్తూ సినిమా మొదలుపెట్టారు. ఆ తర్వాత నిత్య, ఇతడి ఆఫీస్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి కాస్త వినోదం కనిపిస్తుంది. అయితే సంతోష్, నిత్యతో తన ప్రేమకథని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నాలు కాస్త ఫన్నీగా అనిపిస్తాయి కానీ పెద్దగా మెప్పించవు. ఇక సంతోష్ బాస్ ఆనంద్-నిత్య మధ్య చిన్న ట్విస్టుతో ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ అంతా సంతోష్ తన లవ్‌స్టోరీ బయటపెట్టడం, తండ్రి అప్పు తీర్చడం లాంటి సన్నివేశాలతో సాగుతోంది. చివరకు ఏమైందనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఎవరెలా చేశారు? 'బేబి' మూవీతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్.. మధ్య తరగతి కుర్రాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా సెట్ అయిపోయాడు. ఎమోషనల్, కామెడీ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పూజిత పొన్నాడ.. గ్లామర్, యాక్టింగ్‌తో పర్వాలేదనిపించింది. ఆఫీస్‌లో బాస్‌గా చేసిన మధునందన్, రాజేశ్ ఖన్నా, బ్రహ్మాజీ, సిరి హనుమంతు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఓకే. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే సినిమా మరింత ఇంట్రెస్టింగ్గా ఉండేది! (ఇదీ చదవండి: యూట్యూబర్, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్) -
నా ఎనిమిదేళ్ల కల నెరవేరింది
విరాజ్ అశ్విన్, పూజితా పోన్నడ జంటగా అను ప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల నిర్మించిన చిత్రం ‘జోరుగా హుషారుగా..’. ఈ చిత్రం నేడు విడుదలవు తోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్లతో అను ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తూర్పుగోదావరిలోని పెద్దాపురం స్వస్థలం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. జూనియర్ ఆర్టిస్టు, లైట్‌మేన్‌గా చేశాను. ఎడిటింగ్‌లో నైపుణ్యం ఉంది. నా దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ చూసి, నిరీష్‌గారు చాన్స్ ఇచ్చారు. అలా దర్శకుడ్ని కావాలనుకున్న నా ఎనిమిదేళ్ల కల ‘జోరుగా హుషారుగా’తో నెరవేరింది. నా మిత్రుడి జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. ఓ గ్రామం నుంచి పట్నానికి వచ్చిన సంతోష్ (విరాజ్ పాత్ర) జీవితంలో జరిగన ఓ ఘటన అతని జీవితాన్ని ఏ విధంగా మార్చింది? తన కుటుంబాన్ని సంతోష్ ఏ విధంగా కాపాడుకున్నాడు? అన్నది ఈ సినిమా. మంచి హాస్యం, భావోద్వేగం, సంగీతం ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
‘బేబీ’తర్వాత అలాంటి పాత్రలే వస్తున్నాయి: విరాజ్ అశ్విన్
బేబి చిత్రం హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ ప్రేక్షకులు ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇస్తారని అనుకోలేదు. బేబి తరువాత చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ చాలా వరకు లవర్‌బాయ్ పాత్రలే వస్తున్నాయి. అయితే నేను మాత్రం కథ, నా పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటున్నాను’అని యంగ్ హీరో విరాజ్ అశ్విన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్. అనుప్రసాద్ దర్శకుడు. నిరీష్ తిరువిధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా విరాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఒక హిట్ సినిమా తరువాత వస్తున్న సినిమాకు ఎంత పెద్ద హెల్ప్ అవుతుందనడానికి జోరుగా హుషారుగా మంచి ఉదాహరణ. బేబి తరువాత వస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ► బేబీలో ధనిక యువకుడిగా కనిపించాను. ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాను. చేనేత కుటుంబానికి చెందిన యువకుడిగా నాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఎన్నికష్టాలున్నా మనసులో దాచుకుని బయటికి సంతోషంగా కనిపించే యువకుడిగా నా పాత్ర అందరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. పర్సనల్‌గా నాకు నా పాత్ర ఎంతో కనెక్ట్ అయ్యింది. బేబిలో పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తాను. ► ఈ చిత్రంలో ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందర్ని కట్టిపడేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ తన కొడుకును సక్సెస్ఫుల్ చేయడానికి ఎలాంటి త్యాగాలు చేశాడు? ఫ్యామిలీ కోసం కొడుకు ఏం చేశాడు? అనేది ఎంతో ఎమోషన్‌గా ఉంటుంది. ► ప్రస్తుతానికి హీరోగానే కంటిన్యూ చేస్తాను. నచ్చిన పాత్రలు, పవర్ఫుల్ పాత్ర అయితే ఇతర హీరోల సినిమాల్లో కూడా కనిపిస్తాను.