
విరాజ్ అశ్విన్, పూజితా పోన్నడ జంటగా అను ప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల నిర్మించిన చిత్రం ‘జోరుగా హుషారుగా..’. ఈ చిత్రం నేడు విడుదలవు తోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్లతో అను ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తూర్పుగోదావరిలోని పెద్దాపురం స్వస్థలం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. జూనియర్ ఆర్టిస్టు, లైట్‌మేన్‌గా చేశాను. ఎడిటింగ్‌లో నైపుణ్యం ఉంది.
నా దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ చూసి, నిరీష్‌గారు చాన్స్ ఇచ్చారు. అలా దర్శకుడ్ని కావాలనుకున్న నా ఎనిమిదేళ్ల కల ‘జోరుగా హుషారుగా’తో నెరవేరింది. నా మిత్రుడి జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. ఓ గ్రామం నుంచి పట్నానికి వచ్చిన సంతోష్ (విరాజ్ పాత్ర) జీవితంలో జరిగన ఓ ఘటన అతని జీవితాన్ని ఏ విధంగా మార్చింది? తన కుటుంబాన్ని సంతోష్ ఏ విధంగా కాపాడుకున్నాడు? అన్నది ఈ సినిమా. మంచి హాస్యం, భావోద్వేగం, సంగీతం ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment