Joruga Husharuga Movie
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ
'బేబి' సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విరాజ్ అశ్విన్. ఈ మూవీ తర్వాత అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జోరుగా హుషారుగా. అనుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పూజిత పొన్నాడ హీరోయిన్గా యాక్ట్ చేసింది. నిరీష్ తిరువిధుల నిర్మించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 15న విడుదలైంది. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీతోపాటు తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇది థియేటర్లలో పెద్దగా వర్కవుట్ కాలేదు. తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే.. సంతోష్ (విరాజ్ అశ్విన్) సాఫ్ట్వేర్ ఉద్యోగి. తండ్రి (సాయికుమార్) రూ.20 లక్షల అప్పు తీర్చేందుకు తెగ కష్టపడతాడు. సంతోష్ బాస్ ఆనంద్ (మధు నందన్)కు 35 ఏళ్లొచ్చినా పెళ్లి కాలేదు. ఇంతలో హీరో ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ).. చెప్పాపెట్టకుండా ఇతడి ఆఫీసులోనే జాయిన్ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో బాస్.. ఆమెతో ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగింది? సంతోష్ అప్పు తీర్చాడా? తన లవ్‌స్టోరీ సాఫీగా ముందుకు వెళ్లిందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: ‘యాత్ర 2’ టాక్ ఎలా ఉందంటే.. సంగీత దర్శకుడు కన్నుమూత, వందకు పైగా సినిమాలకు.. -
'జోరుగా హుషారుగా' సినిమా రివ్యూ
టైటిల్: జోరుగా హుషారుగా నటీనటులు: విరాజ్ అశ్విని, పూజిత పొన్నాడ, సాయికుమార్, సిరి హనుమంతు తదితరులు సంగీతం: ప్రణీత్ సినిమాటోగ్రఫీ: పి.మహిరెడ్డి నిర్మాత: నిరీష్ తిరువీధుల దర్శకుడు: అనుప్రసాద్ విడుదల: 2023 డిసెంబరు 15 (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ) కథేంటి? సంతోష్ (విరాజ్ అశ్విన్).. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తండ్రి (సాయికుమార్).. రూ.20 లక్షల అప్పు తీర్చేందుకు సంతోష్ తెగ కష్టపడుతుంటాడు. ఇకపోతే సంతోష్ బాస్ ఆనంద్(మధు నందన్)కి 35 ఏళ్లొచ్చినా సరే ఇంకా పెళ్లి కాదు. దీంతో ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. సంతోష్ ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ).. ఏం చెప్పకుండా ఇతడి ఆఫీస్‌లోనే జాయిన్ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో బాస్ ఆనంద్.. సంతోష్ లవర్‌తో ప్రేమలో పడతాడు. మరి చివరకు ఏమైంది? సంతోష్.. తన ప్రేయసి గురించి అసలు నిజం బయటపెట్టాడా? తండ్రి అప్పు తీర్చాడా అనేది 'జోరుగా హుషారుగా' మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? 'బేబి' మూవీలో ఓ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విని.. 'జోరుగా హుషారుగా' అనే ఎంటర్టైనింగ్ మూవీతో సోలోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే ఈ సినిమా రెగ్యులర్ రొటీన్ స్టఫ్‌తోనే తీశారు. చెప్పాలంటే ఇదో రెగ్యులర్ లవ్ స్టోరీ. కాకపోతే తండ్రి అనే ఎమోషన్ జోడించి తీశారు. అయితే అటు ప్రేమకథ గానీ, ఇటు ఫాదర్ ఎమోషన్ గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. (ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?) ఫస్టాప్ విషయానికొస్తే.. సంతోష్‌గా విరాజ్ అశ్విన్ ప్రపంచం, అతడి ప్రేమకథ, ఆఫీస్ వాతావరణాన్ని పరిచయం చేస్తూ సినిమా మొదలుపెట్టారు. ఆ తర్వాత నిత్య, ఇతడి ఆఫీస్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి కాస్త వినోదం కనిపిస్తుంది. అయితే సంతోష్, నిత్యతో తన ప్రేమకథని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నాలు కాస్త ఫన్నీగా అనిపిస్తాయి కానీ పెద్దగా మెప్పించవు. ఇక సంతోష్ బాస్ ఆనంద్-నిత్య మధ్య చిన్న ట్విస్టుతో ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ అంతా సంతోష్ తన లవ్‌స్టోరీ బయటపెట్టడం, తండ్రి అప్పు తీర్చడం లాంటి సన్నివేశాలతో సాగుతోంది. చివరకు ఏమైందనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఎవరెలా చేశారు? 'బేబి' మూవీతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్.. మధ్య తరగతి కుర్రాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా సెట్ అయిపోయాడు. ఎమోషనల్, కామెడీ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పూజిత పొన్నాడ.. గ్లామర్, యాక్టింగ్‌తో పర్వాలేదనిపించింది. ఆఫీస్‌లో బాస్‌గా చేసిన మధునందన్, రాజేశ్ ఖన్నా, బ్రహ్మాజీ, సిరి హనుమంతు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఓకే. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే సినిమా మరింత ఇంట్రెస్టింగ్గా ఉండేది! (ఇదీ చదవండి: యూట్యూబర్, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్) -
నా ఎనిమిదేళ్ల కల నెరవేరింది
విరాజ్ అశ్విన్, పూజితా పోన్నడ జంటగా అను ప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల నిర్మించిన చిత్రం ‘జోరుగా హుషారుగా..’. ఈ చిత్రం నేడు విడుదలవు తోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్లతో అను ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తూర్పుగోదావరిలోని పెద్దాపురం స్వస్థలం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. జూనియర్ ఆర్టిస్టు, లైట్‌మేన్‌గా చేశాను. ఎడిటింగ్‌లో నైపుణ్యం ఉంది. నా దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ చూసి, నిరీష్‌గారు చాన్స్ ఇచ్చారు. అలా దర్శకుడ్ని కావాలనుకున్న నా ఎనిమిదేళ్ల కల ‘జోరుగా హుషారుగా’తో నెరవేరింది. నా మిత్రుడి జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. ఓ గ్రామం నుంచి పట్నానికి వచ్చిన సంతోష్ (విరాజ్ పాత్ర) జీవితంలో జరిగన ఓ ఘటన అతని జీవితాన్ని ఏ విధంగా మార్చింది? తన కుటుంబాన్ని సంతోష్ ఏ విధంగా కాపాడుకున్నాడు? అన్నది ఈ సినిమా. మంచి హాస్యం, భావోద్వేగం, సంగీతం ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
‘బేబీ’తర్వాత అలాంటి పాత్రలే వస్తున్నాయి: విరాజ్ అశ్విన్
బేబి చిత్రం హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ ప్రేక్షకులు ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇస్తారని అనుకోలేదు. బేబి తరువాత చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ చాలా వరకు లవర్‌బాయ్ పాత్రలే వస్తున్నాయి. అయితే నేను మాత్రం కథ, నా పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటున్నాను’అని యంగ్ హీరో విరాజ్ అశ్విన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్. అనుప్రసాద్ దర్శకుడు. నిరీష్ తిరువిధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా విరాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఒక హిట్ సినిమా తరువాత వస్తున్న సినిమాకు ఎంత పెద్ద హెల్ప్ అవుతుందనడానికి జోరుగా హుషారుగా మంచి ఉదాహరణ. బేబి తరువాత వస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ► బేబీలో ధనిక యువకుడిగా కనిపించాను. ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాను. చేనేత కుటుంబానికి చెందిన యువకుడిగా నాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఎన్నికష్టాలున్నా మనసులో దాచుకుని బయటికి సంతోషంగా కనిపించే యువకుడిగా నా పాత్ర అందరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. పర్సనల్‌గా నాకు నా పాత్ర ఎంతో కనెక్ట్ అయ్యింది. బేబిలో పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తాను. ► ఈ చిత్రంలో ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందర్ని కట్టిపడేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ తన కొడుకును సక్సెస్ఫుల్ చేయడానికి ఎలాంటి త్యాగాలు చేశాడు? ఫ్యామిలీ కోసం కొడుకు ఏం చేశాడు? అనేది ఎంతో ఎమోషన్‌గా ఉంటుంది. ► ప్రస్తుతానికి హీరోగానే కంటిన్యూ చేస్తాను. నచ్చిన పాత్రలు, పవర్ఫుల్ పాత్ర అయితే ఇతర హీరోల సినిమాల్లో కూడా కనిపిస్తాను. -
సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను: సాయి కుమార్
-
జోరుగా హుషారుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విరాజ్ అశ్విన్ స్పీచ్
-
మా సినిమా చేనేత కార్మికులకు అంకితం : సాయి కుమార్
‘‘జోరుగా హుషారుగా’లో చేనేత కార్మికుడిగా నటించడం నా అదృష్టం. పోచంపల్లి చేనేత కార్మికుల గురించి చక్కగా చూపించాడు అను ప్రసాద్. ఈ చిత్రాన్ని చేనేత కార్మికులకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు సాయి కుమార్. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అను ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. నిరీష్ తిరువీధుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన దర్శకుడు మల్లిడి వశిష్ట మాట్లాడుతూ– ‘‘బెక్కం వేణుగోపాల్‌గారు కొత్త దర్శకులను, కొత్త కథలను, చిన్న సినిమాలను బాగా ప్రోత్సహిస్తారు. ‘జోరుగా హుషారుగా’ సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగో΄ాల్. ‘‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు విరాజ్ అశ్విన్. ‘‘ఇది నా మొదటి చిత్రం’’ అన్నారు అను ప్రసాద్. ‘‘సినిమా రిలీజ్‌కి బెక్కం వేణుగో΄ాల్గారు అందించిన స΄ోర్ట్ మర్చి΄ోలేను’’ అన్నారు నిరీష్ తిరువీధుల.