టైటిల్: జోరుగా హుషారుగా
నటీనటులు: విరాజ్ అశ్విని, పూజిత పొన్నాడ, సాయికుమార్, సిరి హనుమంతు తదితరులు
సంగీతం: ప్రణీత్
సినిమాటోగ్రఫీ: పి.మహిరెడ్డి
నిర్మాత: నిరీష్ తిరువీధుల
దర్శకుడు: అనుప్రసాద్
విడుదల: 2023 డిసెంబరు 15
(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ)
కథేంటి?
సంతోష్ (విరాజ్ అశ్విన్).. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తండ్రి (సాయికుమార్).. రూ.20 లక్షల అప్పు తీర్చేందుకు సంతోష్ తెగ కష్టపడుతుంటాడు. ఇకపోతే సంతోష్ బాస్ ఆనంద్(మధు నందన్)కి 35 ఏళ్లొచ్చినా సరే ఇంకా పెళ్లి కాదు. దీంతో ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. సంతోష్ ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ).. ఏం చెప్పకుండా ఇతడి ఆఫీస్‌లోనే జాయిన్ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో బాస్ ఆనంద్.. సంతోష్ లవర్‌తో ప్రేమలో పడతాడు. మరి చివరకు ఏమైంది? సంతోష్.. తన ప్రేయసి గురించి అసలు నిజం బయటపెట్టాడా? తండ్రి అప్పు తీర్చాడా అనేది 'జోరుగా హుషారుగా' మెయిన్ స్టోరీ.
ఎలా ఉందంటే?
'బేబి' మూవీలో ఓ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విని.. 'జోరుగా హుషారుగా' అనే ఎంటర్‌టైనింగ్ మూవీతో సోలోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే ఈ సినిమా రెగ్యులర్ రొటీన్ స్టఫ్‌తోనే తీశారు. చెప్పాలంటే ఇదో రెగ్యులర్ లవ్ స్టోరీ. కాకపోతే తండ్రి అనే ఎమోషన్ జోడించి తీశారు. అయితే అటు ప్రేమకథ గానీ, ఇటు ఫాదర్ ఎమోషన్ గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?)
ఫస్టాప్ విషయానికొస్తే.. సంతోష్‌గా విరాజ్ అశ్విన్ ప్రపంచం, అతడి ప్రేమకథ, ఆఫీస్ వాతావరణాన్ని పరిచయం చేస్తూ సినిమా మొదలుపెట్టారు. ఆ తర్వాత నిత్య, ఇతడి ఆఫీస్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి కాస్త వినోదం కనిపిస్తుంది. అయితే సంతోష్, నిత్యతో తన ప్రేమకథని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నాలు కాస్త ఫన్నీగా అనిపిస్తాయి కానీ పెద్దగా మెప్పించవు. ఇక సంతోష్ బాస్ ఆనంద్-నిత్య మధ్య చిన్న ట్విస్టుతో ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ అంతా సంతోష్ తన లవ్‌స్టోరీ బయటపెట్టడం, తండ్రి అప్పు తీర్చడం లాంటి సన్నివేశాలతో సాగుతోంది. చివరకు ఏమైందనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి.
ఎవరెలా చేశారు?
'బేబి' మూవీతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్.. మధ్య తరగతి కుర్రాడు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా సెట్ అయిపోయాడు. ఎమోషనల్, కామెడీ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పూజిత పొన్నాడ.. గ్లామర్, యాక్టింగ్‌తో పర్వాలేదనిపించింది. ఆఫీస్‌లో బాస్‌గా చేసిన మధునందన్, రాజేశ్ ఖన్నా, బ్రహ్మాజీ, సిరి హనుమంతు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఓకే. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే సినిమా మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండేది!
(ఇదీ చదవండి: యూట్యూబర్, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment