రామ్‌ చరణ్‌ RC16 'టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌' విడుదల.. బుచ్చి బాబు మార్క్‌ | Ram Charan And Buchi Babu Sana RC16 Movie First Look Poster With Title Out Now, Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

RC16 First Look Title Update: రామ్‌ చరణ్‌ కొత్త సినిమా 'ఫస్ట్‌ లుక్‌' విడుదల.. బుచ్చి బాబు మార్క్‌ అదుర్స్‌

Published Thu, Mar 27 2025 9:13 AM | Last Updated on Thu, Mar 27 2025 10:53 AM

 Ram Charan And Buchi Babu  RC16 Movie First Look Out Now

రామ్‌ చరణ్‌(Ram Charan)  బర్త్‌ డే సందర్భంగా తన కొత్త సినిమా (RC16) నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఇందులో అదిరిపోయే మాస్‌ గెటప్‌లో ఆయన కనిపిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) తన మార్క్‌ చూపించబోతున్నాడని క్లియర్‌గా అర్థం అవుతుంది.  మల్టీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ రానుంది. అయితే, ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ‌ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌( Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), బాలీవుడ్‌ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

క్రికెట్, కుస్తీ గురించే కాకుండా... మరికొన్ని ఇతర స్పోర్ట్స్‌ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ‘జైలర్‌’ ఫేమ్‌ కెవిన్  కుమార్‌ ఈ యాక్షన్  సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం ఏఆర్‌ రెహమాన్ అందిస్తున్నారు . గేమ్‌ఛేంజర్‌ పరాజయంతో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్‌  ఫస్ట్‌ లుక్‌ ఫుల్‌ జోష్‌ నింపుతుంది. ఈసారి తప్పకుండా హిట్‌ కొడుతున్నాం అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement