నితిన్
అనుకున్న సమయానికంటే ముందుగానే థియేటర్స్‌కు వస్తున్నారు హీరో నితిన్ . వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీ మేన్ ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్, రుచిర ఎంటర్‌టైన్ మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను తొలుత డిసెంబరు 23న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ సమయానికి ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్:సీజ్‌ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘ఎక్స్‌ట్రా’ని కాస్త ముందుగానే డిసెంబరు 8న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment