ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు మనస్థాపంతో ఓ విద్యార్థి బలవన్మరణం చెందాడు.
తుని: ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు మనస్థాపంతో ఓ విద్యార్థి బలవన్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన గొల్లబెల్లి వంశీ(18)కి తల్లిదండ్రులు లేరు. సోదరునితో కలిసి పట్టణంలోనే అద్దెగదిలో ఉంటున్నాడు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో వంశీ రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో మళ్లీ పరీక్ష రాసేందుకు సమాయత్తమవుతున్నాడు. సోదరుడు ఉద్యోగం నిమిత్తం భద్రాచలం వెళ్లగా కొన్ని రోజులుగా వంశీ ఒక్కడే గదిలో ఉంటున్నాడు. ఒంటరితనం, పరీక్ష ఫెయిలైన బాధతో ఉన్న వంశీ బుధవారం ఉదయం రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.