
చంపేస్తామంటూ ప్రేమజంటకు బెదిరింపులు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో కులాంతర ప్రేమవివాహం చేసుకున్నందుకు ఓ జంటను చంపేస్తామంటూ బంధువులు బెదిరిస్తున్నారు. నవ వధువు మాజీ ఎమ్మెల్యే మేనకోడలు. పెళ్లికి అమ్మాయి తరపు వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రేమజంట తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి.
మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మేనకోడలు అయిన సింధూర, వంశీ ఈ నెల 8న సింహాచలం అప్పన్న సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. అయితే సింధూర మైనరని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సహించేదిలేదని, పురుగుల మందు కలిపి ఇద్దరినీ చంపేస్తామంటూ అమ్మాయి తరపు బంధువుల నుంచి బెదిరింపులు వచ్చాయి. నవ వధూవరులు మహిళా సంఘాల సాయంతో డీసీపీ శ్రీనివాసులును కలిశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా అభ్యర్థించారు.