దేవుడికి దగ్గరగా..
గల్లంతైన బాలుడు వంశీ మృతదేహం వెలికితీత
తాత, మనుమడి మృతితో శోకసంద్రమైన కళత్తూరు
తెప్ప ఎక్కనన్నా బలవంతంగా ఎక్కించానే అని తల్లిడిల్లుతున్న తల్లి
స్పృహ కోల్పోరుున బాలుడి తల్లి, అమ్మమ్మ.. చెన్నైకి తరలింపు
దేవుడిని చూడ్డానికి వచ్చి దేవుడి దగ్గరకే వె ళ్లిపోయూవా.. కొడుకా.. నువ్వు తెప్ప ఎక్కనన్నా.. నేనే బలవంతంగా మరీ ఎక్కించానే.. అండగా ఉండే తాతతో పాటు నువ్వూ తోడుగా వెళ్లిపోయూవా.. అంటూ తెప్ప బోల్తా పడిన ప్రమాదంలో మృతిచెందిన బాలుడు వంశీ తల్లి.. సుబ్రమణ్యం కుమార్తె మాలతి గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలచివేసింది. కళత్తూరులో మంగళవారం రాత్రి వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవంలో చోటుచేసుకున్న అపశ్రుతిలో తాత, మనుమడి మృతితో గ్రామం శోకసంద్రమైంది.
వరదయ్యుపాళెం: మండలంలోని కళత్తూరులో మంగళవారం రాత్రి తెప్పోత్సవంలో చోటుచేసుకున్న అపశ్రుతి లో కోనేరులో గల్లంతైన బాలుడి మృతదేహాన్ని బుధవారం వెలికితీశారు. బాలుడి తల్లి మాలతి సూళ్లూరు పేట పట్టణం కోళ్లమిట్టలో కొడుకు వంశీ, తండ్రి సుబ్రవుణ్యం, తల్లి విజయులక్ష్మితో కలిసి జీవిస్తోంది. వూలతి షార్ ఉద్యోగి. కళత్తూరులో వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవానికి తెలిసిన వారి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా వచ్చింది. వంశీని తాత సుబ్రవుణ్యం తెప్ప ఎక్కమని పిలిచాడు. తెప్ప ఎక్కేందుకు ఇష్టపడని వంశీని తల్లి వూలతి దేవుడిని దగ్గరగా చూడొచ్చని చెప్పి ఎక్కించింది. తెప్పోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో తెప్ప కోనేరులో వుునిగి పోరుుంది. ప్రవూదంలో సుబ్రవుణ్యం అక్కిడిక్కడే వుృ తి చెందగా, వునవడు గల్లంతయ్యూడు. ఓవైపు తండ్రి వుృతదేహం పక్కన పెట్టుకొని వురో వైపు కొడుకు ఆచూకీ కోసం వూలతి హృదయువిదారంగా విలపించడం అక్కడివారికి కన్నీరు తెప్పించింది. ఈమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆమె సృ్పహ కోల్పోరుుంది. వంశీ అవ్మువ్ము విజయులక్ష్మి ఈ సంఘటనను చూసి షాక్‌కు గురైంది. విజయులక్ష్మి, వూలతి పరిస్థితి ఆందోళనకరంగా వూరడంతో స్థానికులు చికిత్సనిమిత్తం చెన్నైకి తరలించారు.
బాలుడి వుృతదేహం లభ్యం
కోనేరులో గల్లంతైన వంశీ వుృత దేహాన్ని బుధవారం ఉదయుం 9.30 గంటల సవుయుంలో స్థానికులు వెలికి తీశారు. ప్రవూదం జరిగినప్పటి నుంచి అగ్నిమాపక సిబ్బంది సహకారంతో స్థానికులు బుధవారం ఉదయుం ఉత్సవ విగ్రహాలు, బాలుడు వుృత దేహం కోసం పలు దఫాలుగా తీవ్ర గాలింపు జరిపారు. ఉదయుం 9 గంటల సవుయుంలో ఉత్సవ విగ్రహా లను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విగ్రహాలకు సమీపంలోనే ఉన్న బాలుడు వుృత దేహం వెలికి తీసుకురావడంతోనే గ్రావుంలో తీవ్ర ఉద్వేగం నెలకొంది. వుృతదేహాలను పోస్టువూర్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుత్తూరు డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో వరదయ్యుపాళెం ఎస్‌ఐ వంశీధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.