subramaniam
-
ఆర్సీఈపీ, సీపీటీపీపీలో భారత్ చేరాలి
న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)తోపాటు, సమగ్ర, ట్రాన్స్‌పసిఫిక్ పార్టనర్షిప్కు సంబంధించి ప్రగతిశీల అంగీకారం (సీపీటీపీపీ)లో భారత్ కూడా భాగం కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. 2019లో ఆర్సీఈపీ నుంచి భారత్ బయటకు రావడం గమనార్హం. ‘‘భారీ వాణిజ్య ఒప్పందాల్లో పాలుపంచుకోని దేశాల్లో భారత్ ఒకటి. ఆర్సీఈపీ, సీపీటీపీపీలో భారత్ పాలుపంచుకోవడంతోపాటు సభ్య దేశం కావాలి. దేశ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు ఇది మేలు చేస్తుంది. దేశ ఎగుమతుల్లో 40 శాతం ఎంఎస్ఎంఈలవే ఉంటున్నాయి. బడా కొర్పొరేట్ సంస్థలు గొప్ప ఎగుమతిదారులుగా లేవు’’అని అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆర్సీఈపీ అన్నది 10 ఆసియా దేశాల కూటమి. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిల్యాండ్, ఫిలిప్పీన్స్, లావోస్, వియత్నాం సభ్యదేశాలుగా ఉన్నాయి. సీపీటీపీపీ అన్నది కెనడా, మెక్సికో, పెరూ, చిలే, న్యూజిల్యాండ్, ఆ్రస్టేరలియా, బ్రూనై, సింగపూర్, మలేషియా, వియత్నాం, జపాన్‌తో కూడిన కూటమి.చైనా ప్లస్ వన్‌తో పెద్దగా లబ్ది పొందలేదు..చైనా ప్లస్ వన్ అవకాశాలను భారత్ తగినంత అందిపుచ్చుకోలేదని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత్ కంటే వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, తుర్కియే, మెక్సికో ఎక్కువగా ప్రయోజనం పొందినట్టు చెప్పారు. అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్ బలపడాలంటూ 70 శాతం వాణిజ్యం ఈ రూపంలోనే ఉంటుందన్నారు. ఇతర దేశాల కంటే మన దగ్గర టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మన దగ్గర 2–3 అవరోధాలున్నాయి. టారిఫ్‌లు ఎక్కువగా ఉండడం ఇందులో ఒకటి. టారిఫ్‌లను తగ్గించకపోతే మనం ప్రయోజనం పొందలేం. అలాగే, మనకు కావాల్సిన స్థాయిలో ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు ఉండడం లేదు. సామర్థ్య వినియోగం 70 శాతంగానే ఉంది’’అని సుబ్రమణ్యం వివరించారు. అంతర్జాతీయంగా భారత్ ప్రకాశిస్తున్న కిరణమంటూ, విధానపరమైన స్థిరత్వంతోపాటు సంస్కరణలు వేగవంతమైన వృద్ధి దిశగా నడిపిస్తున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.2 శాతం జీడీపీ వృద్ధిని గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధిలో భారత్ 20 శాతం వాటా సమకూరుస్తోందని, రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందన్నారు. -
అస్తిత్వాన్ని వెలికి తీద్దాం
మనం పై పైన చూసే ఎన్నో విషయాలు మూలాల్లో ఉన్న అస్తిత్వానికి గొడ్డలిపెట్టుగా ఉండవచ్చు. అది మొక్కలకు సంబంధించినవైనా సరే...ప్రపంచంలో తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన వృక్ష జాతుల శాస్త్రీయనామాల మూలాలను శోధించి తిరిగి వాటికి పూర్వపు పేర్లు ఉండేలా కృషి చేస్తోంది భాను సుబ్రమణ్యం. అమెరికాలోని వెల్లెస్లీ కాలేజీలో ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్ ప్రోఫెసర్‌గా ఉన్న భారతీయురాలు.తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన 126 వృక్ష జాతుల మూలాలను శోధించి, తిరిగి వాటి పూర్వపు పేర్లతోనే పిలిచేలా కృషి చేశారు.దీంతో ఆ వృక్షజాతుల పేర్ల గురించి ఎవరు చర్చించినా భాను సుబ్రమణ్యాన్ని గుర్తుంచు కుంటారు. ‘దీనిని అత్యంత క్లిష్టమైన సమస్యగా ఎవరూ గుర్తించరు. అధికారంలో ఉన్నవారు దీనికి అనేక కారణాలు చూపుతారు’ అంటారామె.మొక్కల పేర్ల నుండి స్థానిక జాతుల వరకు ప్రంచంలోని అనేక అంశాలు వలస సామ్రాజ్యాల ద్వారా రూపొందించబడ్డాయి. మనం ఈ వలసరాజ్యాల ఆధిపత్యాన్ని తొలగించాలి’ అంటారు వృక్షశాస్త్రంలో ఎంపరర్‌గా పేరొందిన భాను సుబ్రమణ్యం. తన కొత్త పుస్తకమైన ‘బోటనీ ఆఫ్ ఎంపైర్’లో వలసవాదం సృష్టించే సమస్యలు ఎప్పటికీ అంతం కావని, దాని వెనక తీవ్రమైన ప్రయత్నం ఎలా ఉండాలో తను రాసిన పుస్తకం ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చింది. జాతుల వర్గీకరణ, మొక్కల పునరుత్పత్తి, దండయాత్రల ద్వారా ప్రవేశపెట్టబడిన జాతుల వ్యాప్తికి సంబంధించిన శాస్త్రంగా ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. ‘నేను పరిణామాత్మక జీవశాస్త్రవేత్త, మొక్కల శాస్త్రవేత్తగా పేరొందాను. స్త్రీవాద, సాంకేతిక రంగాలలో మానవీయ, సామాజిక శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాను. జెండర్, జాతి, కులానికి సంబంధించిన శాస్త్రాలు, వైద్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సంస్కృతులను అన్వేషిస్తాను. నా ఇటీవల పరిశోధన వలసవాదం, జీనోఫోబియా చరిత్రలకు సంబంధించిన వృక్షశాస్త్రం వీటన్నింటినీ పునరాలోచింపజేస్తుంది. వలస, ఆక్రమణ జాతులకు సంబంధించి శాస్త్రీయ సిద్ధాంతాలు, ఆలోచనలు, విస్తృత ప్రయాణాలను అన్వేషిస్తుంది.భారతదేశంలో సైన్స్, హిందూ జాతీయవాదం సంబంధంపై కూడా పని చేస్తున్నాను. ఇప్పటివరకు మూడు పుస్తకాలను తీసుకువచ్చాను. వీటిలో ΄్లాంట్ వరల్డ్స్ అండ్ ది సైంటిఫిక్ లెగసీస్ ఆఫ్ కలోనియలిజం ఈ యేడాది తీసుకువచ్చాను. ది బయోపాలిటిక్స్ ఆఫ్ హిందూ నేషనలిజం సొసైటీ ఫర్ లిటరేచర్ బుక్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఈ పుస్తకం భారతదేశంలో పుట్టుకువస్తున్న జాతీయవాద రాజకీయాలు, ఆధునికత, సైన్స్, మతం ఒకదానికి ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలియజేస్తుంది’ అని వివరిస్తుంది. భాను సుబ్రమణ్యం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో పెరిగారు. దీంతో బ్రిటిషర్లు దేశంలో మూలాంశాలను ఎలా మార్చేశారో తెలుసుకున్నారు. ఫెమినిస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనాల కోసం అమెరికాలో పరిణామాత్మక జీవశాస్త్రంలో పీహెచ్‌డి చేశారు. తన రచనల ద్వారా జీవశాస్త్ర పండితురాలిగా పేరొందారు. ఈ ఏడాది జూలైలో జరిగే అంతర్జాతీయ బొటానికల్ కాంగ్రెస్‌లో పాల్గొని, అనేక సవరణలపై చర్చించబోతున్నారు.మొక్కల శాస్త్రీయ నామకరణాన్ని నియంత్రించే అంతర్జాతీయ కోడ్‌కు బాధ్యత వహించే నామకరణ విభాగం, వర్గీకరణ, శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన అనేక సవరణలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రోఫెసర్ సమావేశంలో ΄ాల్గొన బోతున్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన సమావేశంలో తీసుకున్న కోడ్ మెకానిజంలో అనుచితమైనవిగా పరిగణించబడే మరెన్నో మొక్కల పేర్లను ఈ సమావేశం తిరస్కరించవచ్చు. దీని వెనకాల ఈ సీనియర్ ప్రోఫెసర్ చేస్తున్న కృషి మనల్ని ఆలోచింపజేస్తుంది. వలసవాదం సుసంపన్నమైన వృక్ష ప్రపంచాలను జీవశాస్త్ర జ్ఞానంగా ఎలా మార్చింది అనే క్లిష్టమైన చరిత్రను అన్వేషించడానికి బాను సుబ్రమణ్యం దేశీయ అధ్యయనాలను శోధించారు. లాటిన్-ఆధారిత నామకరణ వ్యవస్థ, మొక్కల లైంగికతను వివరించడానికి యూరోపియన్ ఉన్నత వర్గాల ఊహాజనిత విధానాలను ‘బాటనీ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ద్వారా వివరించారు. వలసవాదులు మొక్కల కాలపు లోతైన చరిత్రను ఎలా నిర్మూలించారో మనం ఇందులో చూస్తాం. జాత్యాహంకారం, బానిసత్వం, వలసవాద చరిత్రలలోని దాని మూలల నుండి కేంద్రీకృతమైన వృక్షశాస్త్రానికి సంబంధించిన మరింత సమగ్రమైన, సామర్థ్యం గల రంగాన్ని ఊహించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. -
దేశీ రిటైల్ రంగం @ 2 లక్షల కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో ఒకటైన భారత్ 2032 నాటికల్లా 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఇది 844 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో అసంఘటిత రిటైల్ మార్కెట్ వాటా 87%గా ఉంది. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ సుబ్రమణియం వి. ఈ విషయాలు తెలిపారు. ‘రిటైల్ రంగం ఏటా 10 శాతం వృద్ధితో 2032 నాటికి ఏకంగా 2 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలవనుంది‘ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వ హించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయిలో ఉండటం, ఆర్థిక వనరుల కొరత వంటి సమస్యల కారణంగా అసంఘటిత రిటైల్ రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ వినియోగం ఉండటం లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమ్మిళిత, సుస్థిర వృద్ధికి తోడ్పడేలా వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సుబ్రమణియం చెప్పారు. అసంఘటిత రంగంలోని చిన్న వ్యాపారా ల సమ్మిళిత వృద్ధికి సహకరించేలా ప్రభుత్వ పాలసీ లు, బడా కంపెనీల వ్యాపార విధానాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న స్థాయి తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆధునీకరించుకుని, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు దోహదపడే విధమైన కొనుగోళ్ల వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లైసెన్సింగ్ విధానం మెరుగుపడాలి .. రిటైల్ రంగానికి లైసెన్సింగ్ వంటి అంశాలపరంగా సమస్యలు ఉంటున్నాయని సుబ్రమణియన్ చెప్పారు. ప్రస్తుతం ఒక రిటైల్ స్టోర్ ప్రారంభించాలంటే 10 నుంచి 70 వరకు లైసెన్సులు తీసుకోవాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ఇలా వివిధ లైసెన్సుల అవసరం లేకుండా వ్యాపార సంస్థకు ఒకే లైసెన్సు సరిపోయేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. మరోవైపు దేశీయంగా సరఫరా వ్యవస్థపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరిన్ని పెట్టుబడులు అవసరమని సుబ్రమణియన్ తెలిపారు. ప్రధానమైన సోర్సింగ్ ప్రాంతాలను అవసరానికి తగినట్లు విస్తరించుకోగలిగేలా గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానించాలని ఆయన చెప్పారు. తద్వారా సోర్సింగ్‌కు పట్టే సమయం తగ్గుతుందని, ఉత్పత్తుల రవాణా కూడా వేగవంతం కాగలదని పేర్కొన్నారు. ఇటు స్టోర్స్‌లోనూ, అటు ఈ–కామర్స్లోను కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం రిటైల్ రంగంలో క్రమంగా పెరుగుతోందని సుబ్రమణియన్ వివరించారు. 5జీ రాకతో ఇది మరింతగా పుంజుకోగలదని పేర్కొన్నారు. రిటైల్, ఈ–కామర్స్ పాలసీలపై కేంద్రం కసరత్తు డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ దేశీయంగా రిటైల్ రంగం వృద్ధికి ఊతమిచ్చే దిశగా జాతీయ స్థాయిలో రిటైల్ వాణిజ్యం, ఈ–కామర్స్ విధానాలను రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రుణ లభ్యత మొదలైన వాటి రూపంలో భౌతిక స్టోర్స్‌ను నిర్వహించే వ్యాపార వర్గాలకు ఇది తోడ్పాటునిచ్చే విధంగా ఉంటుందని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు. అటు ఆన్లైన్ రిటైలర్ల కోసం కూడా ఈ–కామర్స్ పాలసీని రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. రిటైల్ ట్రేడర్ల కోసం ప్రమాద బీమా పథకంపైనా కసరత్తు జరుగుతోందని, ప్రధానంగా చిన్న ట్రేడర్లకు ఇది సహాయకరంగా ఉండగలదని ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్‌పై సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ చెప్పారు. భౌతిక, ఆన్లైన్ రిటైల్ వాణిజ్యం రెండింటి మధ్య వైరుధ్యమేమీ లేదని, ఒకటి లేకుండా రెండోది మనలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో ఈ–కామర్స్ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, కొన్ని ఈ–కామర్స్ దిగ్గజాల గుత్తాధిపత్యానికి బ్రేక్ పడుతుందని సంజీవ్ వివరించారు. నాణ్యతలేని ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే లక్ష్యంతో వివిధ ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడంపై కేంద్రం దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు. -
నా తండ్రిని రక్షణ శాఖ కార్యదర్శిగా... ఇందిర తొలగించారు
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అప్పట్లో తన తండ్రి డాక్టర్ కె.సుబ్రమణ్యంను రక్షణ శాఖ కార్యదర్శి పదవి నుంచి తొలగించారని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ‘‘రక్షణ వ్యవహారాల్లో అతి లోతైన పరిజ్ఞానమున్న వ్యక్తిగా నాన్నకున్న పేరు ప్రతిష్టలు అందరికీ తెలుసు. 1979లో కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆయన కార్యదర్శి అయ్యారు. అప్పట్లో అత్యంత పిన్న వయస్కుడైన కార్యదర్శి బహుశా ఆయనే. కానీ 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వస్తూనే మా నాన్నను తొలగించారు’’ అని మంగళవారం ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ‘‘నాన్న చాలా ముక్కుసూటిగా వ్యవహరించేవారు. బహుశా అదేమైనా ఆమెకు సమస్యగా మారిందేమో తెలియదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘ఇందిర చర్య వల్ల మా నాన్న కెరీర్లో ఎదుగుదల శాశ్వతంగా ఆగిపోయింది. తర్వాత ఎన్నడూ కేబినెట్ కార్యదర్శి కాలేకపోయారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఆయన కన్నా జూనియర్ కేబినెట్ కార్యదర్శిగా ఆయన పై అధికారి అయ్యారు. అందుకే మా అన్న కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయికి ఎదిగినప్పుడు నాన్న చాలా గర్వపడ్డారు. కానీ నేను కార్యదర్శి అవడం చూడకుండానే 2011లో కన్నుమూశారు’’ అంటూ చెప్పుకొచ్చారు. జై శంకర్ కూడా 2018లో విదేశాంగ శాఖ కార్యదర్శిగా రిటైరవడం తెలిసిందే. అనుకోకుండా మంత్రినయ్యా కేంద్ర ప్రభుత్వోద్యోగిగా రిటైరయ్యాక తాను రాజకీయాల్లోకి రావడం, మంత్రి కావడం పూర్తిగా తలవని తలంపుగా జరిగిన పరిణామమేనని జైశంకర్ అన్నారు. ‘‘కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఫోన్ రావడంతో ఎంతో ఆశ్చర్యపోయా. రాజకీయ రంగ ప్రవేశంపై చాలా ఆలోచించా. ఎందుకంటే నేనప్పుడు అందుకు సిద్ధంగా లేను’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘నా ఉద్యోగ జీవితమంతా రాజకీయ నాయకులను మంత్రులను దగ్గరగా గమనిస్తూనే గడిపాను. అయినా సరే, నిజాయితీగా చెప్పాలంటే మంత్రి అయ్యాక ఆ పాత్రలో రాణించగలనని తొలుత నాకు నమ్మకం కలగలేదు. కానీ మంత్రిగా నాలుగేళ్ల కాలం చాలా ఆసక్తికరంగా సాగింది. ఎంతో నేర్చుకున్నా’’ అన్నారు. మంత్రి అయ్యాకకూడా బీజేపీలో చేరాల్సిందిగా ఎలాంటి ఒత్తిడీ రాకున్నా తనంత తానుగా చేరానన్నారు. -
సాహసం శ్వాసగా...
ఎప్పటికప్పుడు వినూత్నమైన కథాంశాలు, సరికొత్త పాత్రల్లో ఒదిగిపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గోపీచంద్. కెరీర్లో పాతిక చిత్రాలు పూర్తి చేసిన ఆయన తర్వాతి చిత్రం కోసం సాహసాలు చేయడానికి రెడీ అవుతున్నారు. గోపీచంద్ హీరోగా బిన్ను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. కోలీవుడ్‌లో ‘తని ఒరువన్’ ఫేమ్ దర్శకుడు మోహన్‌రాజా దగ్గర అసోసియేట్‌గా పని చేశారట బిన్ను సుబ్రమణ్యం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. అడ్వెంచరస్ ఎంటర్టైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. దీంతో ఆ పాత్ర కోసం కొంతమంది ప్రముఖ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్. డిసెంబర్లో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
1500 శాఖలు మూతపడ్డాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అటు కస్టమర్లు, ఇటు బ్యాంకు ఉద్యోగులకు చేటు చేస్తుందని ఆల్ఇండియా స్టేట్‌బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ చైర్మన్ జీ. సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. విలీనాలతో కస్టమర్లకు అందించే సేవలపై, బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితాలపై పెను ప్రభావం పడుతుందన్నారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేయడంతో దేశవ్యాప్తంగా దాదాపు 1500 శాఖలు మూతపడ్డాయని, 15,000మంది కి పైగా ఉద్యోగులు రిటైర్మెంట్ తీసుకున్నారని వివరించారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 200కు పైగా శాఖలను మూసివేయడం జరిగిందని, దీంతో ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు అందకుండా పోయాయన్నారు. ఇతర పీఎస్‌బీలను విలీనం చేసినా ఇదే విధంగా పలు శాఖలు మూతపడతాయని, విలీనం చేసుకున్న బ్యాంకు నష్టాలను చవిచూస్తుందని చెప్పారు. ఎస్బీఐ ఫలితాల్లో ఎప్పుడూ కార్యనిర్వాహక లాభం క్షీణించలేదని, మొండిపద్దుల కేటాయింపుల కారణంగా నికర లాభం మాత్రం హరించుకుపోయిందని వివరించారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాల దొంగాట ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం, ఆర్‌బీఐఅని సుబ్రమణ్యం ఆరోపించారు. బడాబడా కార్పొరేట్లకు లోన్లను బ్యాంకు అధికారులు మంజూరు చేయలేరని, కేవలం బ్యాంకు బోర్డు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలవని అన్నారు. ఇప్పుడు దీనిపై కేంద్రం, ఆర్బీఐ దొంగాట ఆడుతున్నాయని వివరించారు. కాగా, ఈ నెల 11న ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్(హైదరాబాద్ సర్కిల్) 32వ జనరల్‌బాడీ సమావేశం జరగనుంది. -
ఆఫీసుకు రా.. తేల్చుకుందాం!
మహానంది: ‘దేవస్థానంలో జరిగే కార్యక్రమాలకు ఎవరిని పిలుచుకోవాలో నాకు తెలీదా? నా ఇష్టమొచ్చినట్టే చేస్తాను. నువ్వెవడివి అడగడానికి?’ అంటూ మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎన్సీ సుబ్రహ్మణ్యం ‘సాక్షి’ విలేకరిపై చిందులు తొక్కారు. ప్రముఖ దేవస్థానానికి ఈఓ అన్న సంగతి మరిచి..‘ఏయ్...ఉండు...ఆఫీసుకు రా తేల్చుకుందాం’ అంటూ ఓ ఫ్యాక్షన్ నాయకుడిలా బెదిరించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహానంది దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన రూపేష్ అనే దాత మూడు వీల్చైర్లను విరాళంగా ఇచ్చారు. వీటి ప్రారంభోత్సవానికి ఎలాంటి ప్రొటోకాల్ లేని కొందరు అధికార పార్టీ నేతలను ఈఓ ఆహ్వానించి.. వారితో ప్రారంభింపజేశారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ‘ఇదేమి భక్తి’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో మహానంది ఈఓ సుబ్రహ్మణ్యం ఉదయాన్నే ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి తిట్లదండకం అందుకున్నారు. ‘ఏం తమాషాగా ఉందా! గంటలోగా ఆఫీసుకు రా.. తేల్చుకుందాం’ అంటూ బెదిరించారు. -
నిరుపేదలకు అండగా 'కల్కి కళ'
-
భర్త ఇంటి ముందు మౌనదీక్ష
కొత్తపల్లి మండలంలో భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్షకు దిగింది. వివరాలు..తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన సత్యశిరీష అనే యువతిని కొత్తపల్లికి చెందిన స్వామిరెడ్డి సుబ్రహ్మణ్యానికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం జరిపించారు. పెళ్లైన ఏడాది వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. మరుసటి ఏడాది నువ్వంటే ఇష్టంలేదని, విడాకులు కావాలని శిరీషను పుట్టింటిలో వదిలేశాడు. రెండు సంవత్సరాలైనా కాపురానికి తీసుకెళ్లకపోవటంతో శిరీష తన అత్తగారింటి ముందు మౌనదీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుంచి కదలబోనని భీష్మించుకు కూర్చుంది. -
ఏసీబీకి పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్
పుట్టిన తేది ద్రువీకరణ పత్రం ఇవ్వడానికి లంచం అడిగిన అధికారిన బాదితుడు ఏసీబీ అధికారులకు పట్టించిన సంఘటన కృష్ణాజిల్లా రెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్నఅప్పిరెడ్డి పుట్టిన తేది ద్రువీకరణ పత్రం కోసం తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం ను సంప్రదించాడు. అందుకు రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో చేసేది లేక.. బాధితుడు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సుబ్రహ్మణ్యం లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం అతన్ని విచారిస్తున్నారు. -
దేవుడికి దగ్గరగా..
గల్లంతైన బాలుడు వంశీ మృతదేహం వెలికితీత తాత, మనుమడి మృతితో శోకసంద్రమైన కళత్తూరు తెప్ప ఎక్కనన్నా బలవంతంగా ఎక్కించానే అని తల్లిడిల్లుతున్న తల్లి స్పృహ కోల్పోరుున బాలుడి తల్లి, అమ్మమ్మ.. చెన్నైకి తరలింపు దేవుడిని చూడ్డానికి వచ్చి దేవుడి దగ్గరకే వె ళ్లిపోయూవా.. కొడుకా.. నువ్వు తెప్ప ఎక్కనన్నా.. నేనే బలవంతంగా మరీ ఎక్కించానే.. అండగా ఉండే తాతతో పాటు నువ్వూ తోడుగా వెళ్లిపోయూవా.. అంటూ తెప్ప బోల్తా పడిన ప్రమాదంలో మృతిచెందిన బాలుడు వంశీ తల్లి.. సుబ్రమణ్యం కుమార్తె మాలతి గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలచివేసింది. కళత్తూరులో మంగళవారం రాత్రి వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవంలో చోటుచేసుకున్న అపశ్రుతిలో తాత, మనుమడి మృతితో గ్రామం శోకసంద్రమైంది. వరదయ్యుపాళెం: మండలంలోని కళత్తూరులో మంగళవారం రాత్రి తెప్పోత్సవంలో చోటుచేసుకున్న అపశ్రుతి లో కోనేరులో గల్లంతైన బాలుడి మృతదేహాన్ని బుధవారం వెలికితీశారు. బాలుడి తల్లి మాలతి సూళ్లూరు పేట పట్టణం కోళ్లమిట్టలో కొడుకు వంశీ, తండ్రి సుబ్రవుణ్యం, తల్లి విజయులక్ష్మితో కలిసి జీవిస్తోంది. వూలతి షార్ ఉద్యోగి. కళత్తూరులో వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవానికి తెలిసిన వారి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా వచ్చింది. వంశీని తాత సుబ్రవుణ్యం తెప్ప ఎక్కమని పిలిచాడు. తెప్ప ఎక్కేందుకు ఇష్టపడని వంశీని తల్లి వూలతి దేవుడిని దగ్గరగా చూడొచ్చని చెప్పి ఎక్కించింది. తెప్పోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో తెప్ప కోనేరులో వుునిగి పోరుుంది. ప్రవూదంలో సుబ్రవుణ్యం అక్కిడిక్కడే వుృ తి చెందగా, వునవడు గల్లంతయ్యూడు. ఓవైపు తండ్రి వుృతదేహం పక్కన పెట్టుకొని వురో వైపు కొడుకు ఆచూకీ కోసం వూలతి హృదయువిదారంగా విలపించడం అక్కడివారికి కన్నీరు తెప్పించింది. ఈమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆమె సృ్పహ కోల్పోరుుంది. వంశీ అవ్మువ్ము విజయులక్ష్మి ఈ సంఘటనను చూసి షాక్‌కు గురైంది. విజయులక్ష్మి, వూలతి పరిస్థితి ఆందోళనకరంగా వూరడంతో స్థానికులు చికిత్సనిమిత్తం చెన్నైకి తరలించారు. బాలుడి వుృతదేహం లభ్యం కోనేరులో గల్లంతైన వంశీ వుృత దేహాన్ని బుధవారం ఉదయుం 9.30 గంటల సవుయుంలో స్థానికులు వెలికి తీశారు. ప్రవూదం జరిగినప్పటి నుంచి అగ్నిమాపక సిబ్బంది సహకారంతో స్థానికులు బుధవారం ఉదయుం ఉత్సవ విగ్రహాలు, బాలుడు వుృత దేహం కోసం పలు దఫాలుగా తీవ్ర గాలింపు జరిపారు. ఉదయుం 9 గంటల సవుయుంలో ఉత్సవ విగ్రహా లను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విగ్రహాలకు సమీపంలోనే ఉన్న బాలుడు వుృత దేహం వెలికి తీసుకురావడంతోనే గ్రావుంలో తీవ్ర ఉద్వేగం నెలకొంది. వుృతదేహాలను పోస్టువూర్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుత్తూరు డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో వరదయ్యుపాళెం ఎస్ఐ వంశీధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కరిణిలో పడి తాత మృతి.. మనుమడి గల్లంతు
వరదయ్యపాళెం: మండలంలో నిర్వహించిన తెప్పోత్సవంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో బాలుడు గల్లంతయ్యాడు. మండలంలోని కళత్తూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పుష్కరిణిలో మంగళవారం రాత్రి తెప్పోత్సవాలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పుష్కరిణిలో తెప్పపై స్వామి అమ్మవార్లను ఉంచి మూడు మార్లు విహరిస్తారు. మూడోసారి విహరించే ముందు రాత్రి 8.45 గంటలకు మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్ తెప్పపైకి వచ్చారు. అంతకుముందే దాదాపు 20 మంది తెప్పపై ఉన్నారు. ఆయనతో పాటు మరో వందమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెప్పపైకి ఎక్కారు. బరువుకు ఎక్కువ కావడంతో తెప్ప బోల్తాపడింది. దీంతో ఉత్సవమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే, నాయకులు కింద పడిపోయారు. ఈ సమయంలో సూళ్లూరుపేటకు చెందిన సుబ్రమణ్యం(65) నీటిలో పడి మృతి చెందాడు. అతని మనుమడు వంశీ(11) పుష్కరిణిలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీ నోట్ లేకుండానే వేతనాల మంజూరా?
యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వెలుగుచూసిన జీతాల కుంభకోణాన్ని నిగ్గుతేల్చడానికి వర్సిటీ అంతర్గత ప్రొఫెసర్ల కమిటీకి తోడుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియమించిన ప్రత్యేక కమిటీ తన నివేదికను అందజేసింది. ఎస్కేయూ యంత్రాంగం చేసిన లోటుపాట్లపై సమగ్రంగా అధ్యయనం చేసిన కాగ్ రిటైర్డ్ అధికారి సుబ్రమణ్యం నివేదికను రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్యకు గురువారం అందజేశారు. ప్రతి ఏటా కోట్ల లావాదేవీలు జరుగుతున్న వర్సిటీలో ఖాతాల నిర్వహణలో మౌలిక సూత్రాలు పాటించలేదని ఆయన తేల్చిచెప్పారు. ఇకముందు ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సవివరంగా వివరించారు. గత కొన్నేళ్ల నుంచి డీనోట్‌పై రిజిస్ట్రార్ సంతకం చేయకుండా ఉండడం తప్పిదం అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.3.05 కోట్ల కుంభకోణం జరిగినట్లు తన నివేదికలో పేర్కొన్నారు. వర్సిటీ ఉద్యోగుల జీతాలలో కోత, అరియర్స్, పెన్షన్స్‌లో ఎంత దొరికితే అంత అన్నట్లుగా దారి మళ్లించినట్లు ప్రధానంగా వెల్లడించారు. ప్రతి ఉద్యోగి వివరాలు ఖాతా నంబరుతో సహా వివరంగా తెలియచేసిన డీనోట్‌పై ప్రతి నెలా ఫైనాన్స్ ఆఫీసర్‌తో సహా సంతకాలు చేయాల్సి ఉంటుందని తన సిపార్సులు వెలిబుచ్చారు. మరో వైపు ఫ్రొపెసర్ల కమిటీ తన పూర్తి నివేదికను వచ్చే వారంలో ఇవ్వనుంది. రిజిస్ట్రార్‌తో ఉద్యోగ సంఘాల వాగ్వాదం: ఎస్కేయూ ఉద్యోగులు తమ జీతాలు చెల్లించాలని రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్యతో వాగ్వాదం చేశారు. గత కొన్నేళ్లుగా డీనోట్‌పై రిజిస్ట్రార్ సంతకం చేయలేదని.. ఈ దఫా కూడా సంతకం చేయనని ఆయన నిరాసక్తత వ్యక్తం చేయడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రిజిస్ట్రార్ చాంబర్లో గంట సేపు బైఠాయించి రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రిజిస్ట్రార్ జేఎన్టీయూకు వెళ్లి ఇన్చార్జ్ వీసీ ఆచార్య కే.లాల్కిశోర్ను సంప్రదించి సుబ్రమణ్యం సిపార్సులను తెలియచేశారు. వీటికి సమ్మతించిన వీసీ డీనోట్‌పై సంతకం చేద్దామని నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలను జమచేశారు. ఈ కార్యక్రమంలో భోదనేతర సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, అధ్యక్షుడు కేశవరెడ్డి ,ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ కస్టడీకి కోరే అవకాశం: ఆర్థిక నేరాలకు పాల్పడిన వర్సిటీ ఉద్యోగులైన ఉదయ భాస్కర్‌రెడ్డి, శేషయ్య, కృష్ణమూర్తిలు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వారిని తిరిగి పోలీస్ కస్టడీలో తీసుకుని ఇంటరాగేషన్ చేయాలని పోలీసు అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. పోలీస్ కస్టడీలో కుంభకోణంలో ఇద్దరు ప్రొఫెసర్ల పాత్ర ఉన్నట్టు వారు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అందరి వివరాలు పూర్తీగా తెలియడానికి వారిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు మెజిస్ట్రేట్‌ను కోరే అవకాశం ఉంది -
పెన్నానదిలో కార్మికుడి గల్లంతు
చెన్నూరు, న్యూస్‌లైన్: చెన్నూరు సమీపంలోని గ్రీన్కో ఎనర్జీ పవర్‌ప్లాంట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాంట్‌కు సంబంధించిన కార్మికుడు ఒకరు విధి నిర్వహణలో పెన్నానదిలో గల్లంతు కావడంపై బంధువులు, స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్ జీఎం, షిఫ్ట్ ఇంజినీర్ సహా సెక్యూరిటీ సిబ్బందిపైనా వారు దాడి చేశారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారలేదు. జీఎం కారుతో పాటు ప్లాంట్‌కు సంబంధించిన ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎందుకంటే... చెన్నూరు మండలం దౌలతాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి పైన పేర్కొన్న ప్లాంట్‌లో టర్బైన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ప్లాంట్‌కు చెందిన రెండు నీటి మోటార ్లకు సంబంధించిన విద్యుత్ తీగలు తెగి రెండు నెలలుగా పని చేయడం లేదు. దీంతో ఆదివారం సాయంత్రం ప్లాంట్ జీఎం హనుమంతరావు ఆదేశం మేరకు మహేశ్వరరెడ్డి సహా సుబ్బారెడ్డి, గంగాప్రసాద్, సుబ్బారెడ్డి అనే నలుగురిని షిఫ్ట్ ఇంజినీర్ సుబ్రమణ్యం వారిని నదిలోకి దింపారు. నది మధ్యలోకి వెళ్లగానే మహేశ్వరరెడ్డి జారి లోపలికి పడిపోయారు. దీంతో భయాందోళనకు గురైన మిగిలిన ముగ్గురూ వెనుదిరిగి వచ్చారు. వంతెన బీమ్ పట్టుకుని కొద్దిసేపు ఆగిన మహేశ్వరరెడ్డి చాలా సేపు పట్టుకోలేక నీటి వేగానికి కొట్టుకెళ్లిపోయారు. ఆ తరువాత అతను గల్లంతయ్యాడు. జీఎం, షిఫ్ట్ ఇంజినీర్, సెక్యురిటీపై దాడి విషయం తెలుసుకొన్న మహేశ్వర్‌రెడ్డి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున పెన్నానది వద్దకు చేరుకున్నారు. ‘మీ నిర్లక్ష్యం వల్లే మా బిడ్డ నీటిలో మునిగిపోయాడంటూ’ వారు రోదించారు. నదిలో గల్లంతైన విషయం తెలిసినా తమకు ఎందుకు సమాచారం అందించలేదని మండిపడ్డారు. ఒక మనిషి నీటిలో మునిగిపోతే కనీసం గాలింపు చర్యలైనా చేపట్టరా అంటూ నిలదీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నదిలోకి ఎలా దింపారంటూ దాడికి దిగారు. ఇందుకు బాధ్యుడైన జీఎం కారును ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డు వేణుగోపాల్‌రెడ్డిపైనా దాడి చేశారు. ఫర్నీచర్‌ను పడేసి పనికి రాకుండా చేసేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజగోపాల్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు వర్గాల వారితోనూ చర్చించి పరిస్థితిని చక్కదిద్దారు. -
ఓబులవారిపల్లె మండలం జీవీపురంలో దారుణ హత్య
పుల్లంపేట(ఓబులవారిపల్లె),న్యూస్‌లైన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్న వారిపై మరోసారి తుపాకీ తూటా పేలింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఉన్మాది ఈ సారి తోట సుబ్రమణ్యం(45) అనే వ్యక్తిని తన తూటాకు బలి తీసుకున్నాడు. గ్రామానికి చెందిన ఐదుగురిని లక్ష్యంగా చేసుకుని 2009లో ప్రారంభమైన హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఓబులవారిపల్లె మండలం గాదెల వెంకటాపురం (జీవీ పురం) గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పొలం పనులు చేసుకుంటున్న తోట సుబ్రమణ్యం (45) అనే వ్యక్తిపై పొదల మాటున దాక్కున్న వెంకటరమణ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో సుబ్రమణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుటుంబానికి దాయాదులు అన్యాయం చేశారనే కసితో ఉన్మాది వరుస హత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 2009 జూన్30వ తేదీన వెంకటరమణ, 2012 జూన్ 29న బండి. రామకృష్ణయ్య అనే వ్యక్తులు హతమయ్యారు. ప్రస్తుతం తోట సుబ్రమణ్యం కూడా ఇదే రీతిలో తుపాకీకి బలికావడం గమనార్హం. తోట సుబ్రమణ్యంకు ప్రాణ హాని ఉందనే కారణంగా గతంలో పోలీసులు ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఎస్కార్టు ఖర్చులు తాను భరించలేనని చెప్పడంతో పోలీసులు ఎస్కార్టును ఉపసంహరించారు. ఇదే అదనుగా భావించిన నిందితుడు పక్కా సమాచారం, ప్రణాళికతో హత్యచే సి పారిపోయినట్లు స్పష్టమవుతోంది. సంఘటన తెల్లవారుజామున జరిగితే ఉదయం 7 గంటల వరకు కూడా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ ఈ హత్య జరగడం పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. సంఘటన స్థలాన్ని రాజంపేట డీఎస్పీ అన్యోన్య, సీఐ రమాకాంత్, ఎస్ఐ మోహన్‌లు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య,ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాగా గ్రామానికి చెందిన గద్దె చిన్నవెంకటయ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్మాది హిట్ లిస్టులో ఉన్నట్లు సమాచారం.