పుట్టిన తేది ద్రువీకరణ పత్రం ఇవ్వడానికి లంచం అడిగిన అధికారిన బాదితుడు ఏసీబీ అధికారులకు పట్టించిన సంఘటన కృష్ణాజిల్లా రెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకుంది.
పుట్టిన తేది ద్రువీకరణ పత్రం ఇవ్వడానికి లంచం అడిగిన అధికారిన బాదితుడు ఏసీబీ అధికారులకు పట్టించిన సంఘటన కృష్ణాజిల్లా రెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్నఅప్పిరెడ్డి పుట్టిన తేది ద్రువీకరణ పత్రం కోసం తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం ను సంప్రదించాడు. అందుకు రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో చేసేది లేక.. బాధితుడు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సుబ్రహ్మణ్యం లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం అతన్ని విచారిస్తున్నారు.