కొత్తపల్లి మండలంలో భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్షకు దిగింది.
కొత్తపల్లి మండలంలో భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్షకు దిగింది. వివరాలు..తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన సత్యశిరీష అనే యువతిని కొత్తపల్లికి చెందిన స్వామిరెడ్డి సుబ్రహ్మణ్యానికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం జరిపించారు. పెళ్లైన ఏడాది వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. మరుసటి ఏడాది నువ్వంటే ఇష్టంలేదని, విడాకులు కావాలని శిరీషను పుట్టింటిలో వదిలేశాడు. రెండు సంవత్సరాలైనా కాపురానికి తీసుకెళ్లకపోవటంతో శిరీష తన అత్తగారింటి ముందు మౌనదీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుంచి కదలబోనని భీష్మించుకు కూర్చుంది.