ఎప్పటికప్పుడు వినూత్నమైన కథాంశాలు, సరికొత్త పాత్రల్లో ఒదిగిపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గోపీచంద్. కెరీర్‌లో పాతిక చిత్రాలు పూర్తి చేసిన ఆయన తర్వాతి చిత్రం కోసం సాహసాలు చేయడానికి రెడీ అవుతున్నారు. గోపీచంద్ హీరోగా బిన్ను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. కోలీవుడ్‌లో ‘తని ఒరువన్’ ఫేమ్ దర్శకుడు మోహన్‌రాజా దగ్గర అసోసియేట్‌గా పని చేశారట బిన్ను సుబ్రమణ్యం.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. అడ్వెంచరస్ ఎంటర్‌టైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. దీంతో ఆ పాత్ర కోసం కొంతమంది ప్రముఖ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్. డిసెంబర్‌లో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.
సాహసం శ్వాసగా...
Published Wed, Nov 28 2018 12:25 AM | Last Updated on Wed, Nov 28 2018 12:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment