అక్కినేని- నాటా- వంశీ అవార్డ్స్ ఏర్పాటు | ANR - Natal - formed film awards | Sakshi
Sakshi News home page

అక్కినేని- నాటా- వంశీ అవార్డ్స్ ఏర్పాటు

Published Sun, Jun 29 2014 1:03 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అక్కినేని- నాటా- వంశీ అవార్డ్స్ ఏర్పాటు - Sakshi

అక్కినేని- నాటా- వంశీ అవార్డ్స్ ఏర్పాటు

సాక్షి,సిటీబ్యూరో: పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేర అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ వంశీ ఇంటర్నేషనల్, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి సహకారంతో ‘అక్కినేని- నాటా- వంశీ అవార్డ్స్‌ను ఏర్పాటు చేసినట్లు వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు శనివారం తెలిపారు. డల్లాస్‌లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా అవార్డులను అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున తన నివాసంలో సంబంధిత బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ అవార్డ్స్‌ను జూలై 4,5,6 తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో జరిగే రెండవ నాటా మహాసభలో ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాదేవి, శైలజా తదితరులు పాల్గొన్నారు.
 
అక్కినేని- నాటా- వంశీ -2014 అవార్డ్స్ గ్రహీతలు వీరే..
 
అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న డాక్టర్ ప్రేమ్‌రెడ్డి(లాస్‌ఏంజిల్స్), డాక్టర్ మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి( డెన్వర్), డాక్టర్ పి.మల్లారెడ్డి(న్యూజెర్సీ), గుమ్మడి ధర్మారెడ్డి (లాస్‌ఏంజిల్స్), ఏవీఎన్ రెడ్డి(హ్యూస్టన్), డాక్టర్ పొలిచెర్ల హర్నాథ్(డెట్రాయిట్), ఇందుర్తి బాలరెడ్డి(అట్లాంటా), డోక్క ఫణి( అట్లాంటా), ఆకునూరి శారదా (హూస్టన్), గుడ్ల మాధురి (ఫారిడా).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement