
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
సంగారెడ్డి మండలం కొయ్యగుండు తాండ పరిధిలో ఈ నెల 16న జరిగిన దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం నలుగురు నేరస్తులు గణేశ్‌గడ్డ దాబా వద్ద సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు పకడ్బంధీగా వెళ్లి వారిని పట్టుకున్నారు.
అరెస్టయిన వారిలో మహేశ్‌కుమార్, వంశీ, మెన్‌సోత్ నరేందర్ నాయక్, భానుచందర్‌లు ఉన్నారు. వీరి నుంచి రూ.6 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఒక ట్రాలీ ఆటో, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఈ నెల 16న హైద్రాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న ఓ లారీని అటకాయించి లారీ డ్రైవర్, క్లీనర్లలను చితకబాది వారి వద్ద నున్న సొమ్ము ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.