గోదారమ్మ ఒడిలోనే వంశీ... | vamsi is missing godavari | Sakshi
Sakshi News home page

గోదారమ్మ ఒడిలోనే వంశీ...

Published Sat, Feb 27 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

గోదారమ్మ ఒడిలోనే వంశీ...

గోదారమ్మ ఒడిలోనే వంశీ...

నిలిచిన గాలింపు చర్యలు
వెనుదిరిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
జలసమాధిగా భావిస్తున్న అధికారులు
పుట్టెడు దుఃఖంలో కుటుంబసభ్యులు

 
 
కాళేశ్వరం :  ఆరు రోజులుగా పుట్టెడు దుఃఖంతో వంశీ కుటుంబసభ్యులు ఆఖరిచూపు కోసం ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయూరు. పడవ ప్రమాదంలో కాటారం మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుర్రి వంశీ(11) జలసమాధి అయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 21న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలూకాలోని చింతలపల్లి నుంచి మహదేవపూర్ మండలం మెట్‌పల్లి వద్ద గోదావరి, ప్రాణహితనదులపై వంతెన వద్ద పడవ బోల్తా పడడంతో వంశీ గల్లంతైన విషయం తెలిసిందే. ఈప్రమాదంలో 24 మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. వంశీ కోసం ఆరు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వంతెన కాంట్రాక్టర్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినా చివరికి నిరాశే మిగిలింది. శుక్రవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం తిరుగు ప్రయాణమయ్యారు. పోలీసులు కూడా ఆరు రోజులుగా వెతికి వంశీ ఆచూకీ తెలియకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. వంశీతో నీటిలో మునిగిన మూడు బైకులు అతికష్టం మీద లభ్యమయ్యాయి.

సుమారు 2 మీటర్ల లోతులో ఇసుక కప్పేసి ఉంది. పొక్లెరుున్ల సాయంతో తాత్కాలిక వంతెనలకు ఇరువైపుల తవ్వి గాలింపు చర్యలు చేశారు. ఇదే ప్రమాదానికి గురైన వంశీ సోదరి సౌజన్య హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి నిలకడ ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు బంధువులు పేర్కొంటున్నారు. వంశీ ఆచూకీ కోసం ఎదురు చూసిన తండ్రి మొగిళి, సోదరుడు అనిల్, బాబాయ్ రాజేశ్ కన్నీరుమున్నీరవుతున్నారు. మనసులో ఏదో ఒక చోట వంశీ వస్తాడనే చిన్న ఆశతో ఆరు రోజులుగా ఎదురుచూస్తున్నారు. చివరికి వారుకూడా వెనుదిరిగిపోతున్నారు. పోలీసులు మళ్లీ గాలింపును పొడి గిస్తామని చెబుతున్నారు. ఆరురోజులుగా సిరొంచా డీఎస్పీ శివాజీ పవార్, సీఐ లుకుడే,తహశీల్దార్ సతీష్‌కుమార్, ఎస్సై కృష్ణారెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీరితోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం 18మంది సభ్యులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. అందరూ వెళ్లిపోవడంతో గోదావరి వంతెన ప్రాంతం నిర్మానుష్య వాతావరణ కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement