కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి జమ్మూ కాశ్మీర్ఎన్నికల ఇన్‌చార్జ్ బాధ్యతలతో బిజీబిజీ
పోటీలో ఎంపీలు ఈటల, డీకే అరుణ, అర్వింద్, రఘునందన్
అదే వరుసలో ఎమ్మెల్యేలతోపాటు పాత, కొత్త నేతలు కూడా....
ఎటూ తేల్చుకోలేకపోతున్న బీజేపీ కేంద్ర నాయకత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం ఎటూ తేలలేదు. దీంతో పార్టీ నాయ కులు, కార్యకర్తల్లో స్తబ్దత నెలకొంది. కేంద్ర కేబినెట్ ఏర్పాటు, తదనంతర పరిణామాల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చి హడావిడి జరిగినా, ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగింది. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించారు. దీంతో ఆయన అటు మంత్రిగా పార్లమెంట్ సమావేశాలు, కశ్మీర్ బాధ్యతలతో బిజీగా ఉంటున్నారు. కశ్మీర్ ఎన్నికలు వచ్చే సెపె్టంబర్ నెలాఖరులోగా జరిగే అవకాశాలు ఉండటంతో అప్పటి దాకా అధ్యక్షుడి గా ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించే పరిస్థితులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అ యితే ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దా నిపై బీజేపీ కేంద్రం నాయకత్వం ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. దీంతో ఈ అంశం కొంతకాలం పాటు పెండింగ్‌లో పడినట్టుగానే భావించాల్సి ఉంటుందని పారీ్టవర్గాలు పేర్కొంటున్నా యి. రాష్ట్రంలో అడపాదడపా యువమోర్చా, మహిళా మోర్చా ల వంటి విభాగాలు ఆయా అంశాలు, సమస్యలపై నిరసనలు, దీక్షలు వంటివి చేపడుతున్నా పెద్దనాయకులెవరూ పాల్గొనకపోవడంతో అవి పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి.
అ«ధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్యనేతలు పోటీపడుతున్నా, చివరకు ఎవరిని నియమిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. పారీ్టలో ఉన్న ఇప్పటికే ఉన్న కొందరు ముఖ్యనేతలు, పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయలేమి, కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పవర్‌సెంటర్లుగా మారడం వంటి కారణాలతో పారీ్టనాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేస్తోందని పారీ్టనాయకులు భావిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగిసి, ఆయన్ను కూడా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నందున, కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
కొనసాగుతున్న ఉత్కంఠ
కొత్త అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్‌రావు గట్టిగా పోటీపడుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కేంద్రమంత్రిగా, బీజేఎలీ్పనేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచి్చనందున, బీసీ వర్గాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈటల పేరు దాదాపుగా ఖరారై ప్రకటించాల్సిన దశలో మళ్లీ ఏవో కారణాలతో వాయిదా పడినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఒకరి ఎంపిక ఉండొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. పారీ్టపరంగా చూస్తే ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఎ¯న్.రామచంద్రరావు, టి.ఆచారి, ఎం.ధర్మారావు డా.జి. మనోహర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
అధ్యక్ష పదవి కోసం పాత,కొత్త నాయకుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొనడంతో రాష్ట్ర పారీ్టలోనూ విచిత్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతకాలం క్రితమే పారీ్టలో చేరిన వారికి కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా బలంగానే వినిపిస్తోంది. మరోవైపు 1951లో జనసంఘ్ కాలం, 1980లో బీజేపీగా ఏర్పడ్డాక ఇప్పటిదాకా రెండేళ్ల పాటు మాత్రమే బంగారు లక్ష్మణ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. ఇదీగాకుండా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దళిత సామాజికవర్గాల ఆదరణను పొందలేకపోయినందున ఈసారి ఓ సీనియర్ ఎస్సీ నేతను కొత్త అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఈ వర్గాల్లోనూ పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుందని ఓ వర్గం నాయకులు గట్టిగా వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment