
అప్పులు, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఒకటే
ఎన్నికల్లో లబ్ధికోసమే హిందీపై డీఎంకే రాద్ధాంతం
కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శలు
సాక్షి, హైదరాబాద్: అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వంతో పోటీ పడుతోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారం, లిక్కర్ దోపిడీ, అక్రమ భూముల వ్యవహారం, భూముల అమ్మకాలు, అప్పులు చేయడం, అహంకారపూరిత వ్యవహారశైలి గత బీఆర్‌ఎస్ పాలన తరహాలోనే ఇప్పుడూ ఉందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలుచేయకుండా మోసం చేస్తోందని ఆరోపించారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రూ.152 లక్షల కోట్లు అప్పు చేసిందని గుర్తుచేశారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేయటంలో గత బీఆర్‌ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్‌కు తేడా లేదని విమర్శించారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై డీఎంకే, కాంగ్రెస్ పారీ్టల వైఖరి వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, డీలిమిటేషన్‌ను బూచిగా చూపించి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment