![Randeep Surjewala Gets Additional Charge Of Poll-Bound MP - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/18/surjjj%27.jpg.webp?itok=nGYUDRW6)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ గురువారం సంస్థాగతంగా కీలక మార్పులను ప్రకటించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్‌కు పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జిగా రణదీప్ సూర్జేవాలాను నియమించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్‌కు అప్పగించింది. గుజరాత్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జిగా ముకుల్ వాస్నిక్‌ను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారని ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం పార్టీ కర్ణాటక ఇన్‌చార్జిగా ఉన్న సూర్జేవాలా మధ్యప్రదేశ్ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తారు. సూర్జేవాలాను మధ్యప్రదేశ్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా ఇటీవలే పార్టీ నియమించింది. అజయ్ రాయ్ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేశారు. దళిత నేత, యూపీ పార్టీ చీఫ్ బ్రిజ్‌లాల్ ఖబ్రి స్థానంలో రాయ్ తక్షణమే నూతన బాధ్యతలు చేపడతారని పార్టీ ప్రకటన పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment