
నిజామాబాద్ రూరల్ నుంచే పోటీ: డీఎస్
డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచే తాను శాసనసభ స్థానానికి పోటీ చేస్తానని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రకటించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్థానంలో ఇంకెవరున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు.