కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ తీరు వల్ల కాంగ్రెస్సే నష్టపోతోందని, కాంట్రవర్సీలు చేయడం ఆయనకు అలవాటు అని డీఎస్ మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, ఇందుకు సంబంధించి దిగ్విజయ్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డీఎస్ డిమాండ్ చేశారు.