
ప్రేమాభిమానాలతో విడిపోదాం:డీఎస్
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం అనివార్యమైన నేపథ్యంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు తగవని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్..ప్రేమాభిమానాలతో విడిపోదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు.
అదే విషయాన్ని ఆయన ఇక్కడ ఢిల్లీ పెద్దల చెవిలో చెబుతున్నారని డీఎస్ తెలిపారు.ప్రజలకు మాత్రం వేరే మాట చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యి ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నారు.