కాంగ్రెస్ పార్టీకి సమస్యలున్నాయి: డీఎస్
న్యూఢిల్లీ: సీమాంధ్రలో కాంగ్రెస్‌కు కొన్ని సమస్యలు ఉన్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునర్‌వైభవం సాధిస్తుందనే ఆశాభావాన్ని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని డీఎస్ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
ఈసారి ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అభ్యర్థులందరికి సామాజిక న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందని డీఎస్ వెల్లడించారు. గతంలో నిజమాబాద్ అర్బన్ స్థానంలో పోటి చేసి ఓటమి పాలైన డీఎస్ నిజామాబాద్ రూరల్ టికెట్ ను ఆశిస్తున్నారు. నిజమాబాద్ రూరల్ టికెట్ కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ మందు తన అభిప్రాయాలను డీఎస్ వెల్లడించారు.