కాంగ్రెస్ పార్టీకి డీ.శ్రీనివాస్ గుడ్బై చెప్పారు. ఆయన బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ..
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి డీ.శ్రీనివాస్ గుడ్బై చెప్పారు. ఆయన బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమంక్షంలో డీ.శ్రీనివాస్ గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్లో జరిగి ఈ కార్యక్రమంలో కేసీఆర్ పార్టీ కండువా కప్పి డీఎస్ను పార్టీలోకి ఆహ్వానించారు.
డీఎస్తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేశారు. కాగా డీఎస్కు కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి కానీ, రాజ్యసభ సభ్యునిగా కానీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.