తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆపార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు. డీ శ్రీనివాస్ ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మరికాసేపట్లో డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా డీఎస్ బాటలోనే పయనిస్తున్నారు. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 6వ తేదీన గులాబీ కండువా కప్పుకోనున్నారు.