కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకో: డీఎస్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ 100 రోజుల పాలనలో ప్రజలకు కేసీఆర్ చేసిందేమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలని డీఎస్ సూచించారు.
ఎన్నికల ప్రచారం, మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరకపోతే తల నరక్కుంటానన్న కేసీఆర్ ప్రకటనను నమ్మి ప్రజలు టీఆర్ఎస్‌ను గెలిపించారని ఆయన అన్నారు. కాని కేసీఆర్ మాత్రం ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు తీసుకోవడంలేదని డీఎస్ విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా నడుస్తోందా, లేక ఏకపక్షంగా నడుస్తోందా అర్ధం కావడంలేదని డీఎస్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు ప్రజలే వాటిని సరిదిద్దాలని డీఎస్ అన్నారు.