
అహంకారంతో వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు: డీఎస్
చేగుంట: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి చెల్లని రూపాయి అంటూ మహిళలను అవమానించే విధంగా టీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు, శాసనమండలి పక్షనాయకుడు డి. శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసేవకు ప్రాముఖ్యత ఇచ్చే సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, సునీ తాలక్ష్మారెడ్డి, బండి నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.