'బిల్లు తిప్పి పంపితే రాష్ట్రపతికి చేరుతుంది.. అంతే!'
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 ను తిప్పిపంపాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ స్పందించారు. విభజన బిల్లును తిప్పి పంపితే తెలంగాణకు నష్టమేముండదు అని డీఎస్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన గడువు కంటే ఇంకా నాలుగు రోజులు మందుగానే రాష్ట్రపతికి చేరుతుంది. అంతేకాని తెలంగాణకు వ్యతిరేకంగా ఏమి జరగదు అని ఆయన అన్నారు.
బిల్లుపై సీఎం కిరణ్ స్పందించిన తీరును డీఎస్ తప్పుపట్టారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నెలన్నర తర్వాత...అది తప్పులు తడకలుగా ఉందని సీఎం అనడం హస్యస్పదం అని డి. శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
‘‘బిల్లు లోపభూయిష్టం, రాజ్యాంగ ఉల్లంఘనలున్నాయంటూ.. బిల్లును తిప్పి పంపాలని అంటూ సీఎం కిరణ్ అసెంబ్లీ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.