
బిల్లుపై గడువును పెంచండి:సీఎం
హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై గడువును మరింత పెంచాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతిని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ లేఖను రాశారు.అసెంబ్లీ చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టి.బిల్లును చర్చించేందుకు మరో నెలరోజులు గడువు ఇవ్వాలని రాష్ట్రపతికి సీఎం విజ్ఞప్తి చేశారు. కాగా, తెలంగాణ బిల్లుపై ఈనెల 23వ తేదీలోగా అసెంబ్లీలో చర్చను ముగించాలని టీ-జేఏసీ చేస్తుంది. అలా కాకుండా సీమాంధ్రనాయకుల లాబీయింగ్, కుట్రలకు లొంగి కేంద్రం మరో పదిరోజుల గడువు పొడిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.
విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఇచ్చిన గడువును పెంచినా తెలంగాణ ఆవిర్భావానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి తదితరులతో శుక్రవారం కేసీఆర్ తన నివాసంలో పలు అంశాలపై చర్చలు జరిపారు.గడువు పెంచినా, పెంచకపోయినా నష్టం ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.