
డి.శ్రీనివాస్
నిజమాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు. ఇక్కడ తన ఆధ్వర్యంలో జరిగిన సోనియాకు కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబువి ఊసరవెల్లి నాటకాలని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు కాబోతుందని జోస్యం చెప్పారు. ఇన్నాళ్లు తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబేన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చేదని డీఎస్ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవులన్నీ అనుభవించి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. ఈ సభకు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, అంజన్ కుమార్ హాజరయ్యారు.