
డి.శ్రీనివాస్
హైదరాబాద్: తాము అస్త్ర సన్యాసం చేయలేదని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షనేత మాట్లాడుతుండగానే ఓటింగ్ మొదలుపెట్టారని విమర్శించారు.
మండలి చైర్మన్ ఓటింగ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌కు ఓటు వేసినట్టేనని ఆయన అన్నారు. ఎమ్మెల్సీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డీఎస్ డిమాండ్ చేశారు.