డిచ్‌పల్లి/వినాయకనగర్, న్యూస్‌లైన్: పార్లమెంటులో బీజేపీ మద్దతు ద్వారానే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరచిపోవద్దని ఆ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, జిల్లా కేంద్రంలో నిజామాబాద్ నగర కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేసిన జాప్యం వల్లనే తెలంగాణలో 1969 ఉద్యమంలో 369 మంది, ఈసారి ఉద్యమంలో సుమారు 11వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమందిని పొట్టన బెట్టుకున్న కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ, తెలంగాణపై కిరికిరి చేస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందన్నారు. రూ. 300 ఉన్న కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర రూ.1200 లకు పెరిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో రైతాంగానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా ఇస్తుంటే మన రాష్ట్రం లో 7 గంటలు కూడా సరిగా ఇవ్వలేని దుస్థితి నెల కొందన్నారు. దేశ ప్రధానిగా నరేంద్రమోడీని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘తెలంగాణను బంగారు పల్లెంలో తెస్తానని చెప్పిన నిన్ను నిజామాబాద్ అర్బన్ ప్రజలు తిరస్కరిచడంతో రూరల్‌కు వెళ్లావు. అక్కడి ప్రజలు తిరస్కరిస్తే ఎక్కడికెళ్తావు.. ధర్మపురికా?’ అంటూ నాగం ఎద్దేవా చేశారు.
భద్రాచలం తెలంగాణ లోనిదేనని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక వేళ కాంగ్రెస్ అధిష్టానం మోసం చేస్తే 2014 ఎన్నికల్లో ఎన్‌డీఏ అధికారంలోకి రాగానే 90 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. బీజే పీ శాసన సభా పక్షనేత యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ డి శ్రీనివాస్‌ను నగర ప్రజలు తిరస్కరించినప్పటికీ తాను అభివృద్ధి చేశానని డబ్బా కొట్టుకుంటున్నాడని విమర్శించారు. నగరాన్ని నాశనం చేసింది డీఎస్, నగర మేయర్‌గా పనిచేసిన ఆయన కొడుకేనని అన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లు, రింగ్ రోడ్డు నిర్మాణానికి తాను కృషి చేస్తే.. అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో డీఎస్ ఆ శాఖ ఎస్‌ఈ పై తీవ్ర ఒత్తిడి చేశారని, దీంతో అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని యెండల ఆరోపించారు. బస్టాండ్ రోడ్డులో ఫ్లైవర్ పై ఉపరితల మంత్రితో మాట్లాడానని, రైల్వేకమాన్ వద్ద సమస్య తీర్చడానికి ఆ శాఖకు నివేదికలు పంపిచామని యెండల తెలిపారు. నిధులు తెప్పించి మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని యెండల పేర్కొన్నారు.
యువమోర్చ ఆధ్వర్యంలో నగరంలో ఇంటింటికి తిరి గి, డిగ్రీ కళాశాల్లో ఓటరు నమోదు చేయించాలని యెండల సూచించారు. సమావేశాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, ఆలూర్ గంగారెడ్డి, డాక్టర్ బాపురెడ్డి, జలిగం గోపాల్, మల్లేశ్ యాదవ్,జైభరత్, కరిపే గణేష్,ఆనంద్‌రెడ్డి,మచ్చల్‌శ్రీనివాస్, గణపతి, నాంచారిశైలజ, శ్రీవాణి,కల్పన గణేష్‌కుమార్, గంగమ్మ, మణి,సిద్దం మాధ వి, తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, వసంత్‌రె డ్డి, రమణారెడ్డి, గీతారెడ్డి, భూమన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనిల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మేకబాగారెడ్డి (డిచ్‌పల్లి), రాజేశ్వర్ (సిరికొండ), దాస్(దర్పల్లి), నర్సయ్య (జక్రాన్‌పల్లి) తదితరులు పాల్గొన్నారు.
మత విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్
మత విద్వేషాలను రెచ్చగొడుతూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్‌లో ముస్లింలు బీజేపీ తరపు న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లుగా విజయం సాధిం చిన వారున్నారన్నారు. బీజేపీ మైనార్టీ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి మిర్జా మునీర్ బేగ్, జిల్లా అధ్యక్షులు రషీద్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మద్దతిస్తేనే ‘తెలంగాణ’
Published Sun, Nov 24 2013 5:49 AM | Last Updated on Fri, Oct 19 2018 7:27 PM
Advertisement
Advertisement