సోనియాగాంధీకి కృతజ్ఞతగా బహిరంగ సభ
నిజామాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సోనియాగాంధీ నిర్ణయం మేరకే తెలంగాణ అవిర్భావం జరుగుతున్నట్లు మాజీ పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదించబడేంత వరకూ ఓపిక అవసరమని డీఎస్ సూచించారు. తెలంగాణ ఉద్యోగులు వాచ్‌డాగ్‌లా పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోనియాగాంధీ నిద్రలో కూడా తెలంగాణ గురించే ఆలోచించి ఉంటారని డీఎస్ పేర్కొన్నారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగానో, దేశానికి రెండో రాజధాని గానో చేసే ఆలోచన యుపిఏకు లేదని చెప్పారు. రాష్ట్ర విభజనపై సంప్రదించలేదని సీమాంధ్ర నేతలు, ప్రజలు అనడం సరికాదన్నారు.