సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘మన పార్టీలో నేతలకు ఎప్పుడూ పదవుల ధ్యాసే... ఓ వైపు ఎన్నికలు జరుగుతుంటే, మరోవైపు ముఖ్యమంత్రిని తానేనంటూ ఎవరికి వారే 20 మంది వరకు ప్రచారం చేసుకున్నారు.. వాళ్లు కనీసం ఒక్కొక్కరు ముగ్గురిని గెలిపించినా అధికారం దక్కేది.అది చేయకుండా ‘తెలంగాణ’ ఇచ్చిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా పదవుల కోసం లాబీయింగ్ చేశారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా, ఏ మాత్రం ఆకట్టుకోని ఎన్నికల మేనిఫెస్టోతో వెళ్తే నష్టం జరిగిం ది.’ అంటూ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నేతలు టీపీసీసీ సమీక్ష సమావేశంలో పార్టీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎదుట కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం. మంగళవా రం ఉదయం పదిన్నర నుంచి రాత్రి వర కు హైదరాబాద్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమీక్ష సమావేశాలు జరిగాయి.
సుమారు ఎనిమది గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో సార్వత్రిక, స్థానిక ఎన్నికల ఫలితాలు, ప్రతికూల పరిస్థితులు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ స్వయంకృతాపరాధమేనని పలువురు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశం, సోనియాగాంధీ సూచనలను ప్రజలలోకి తీసుకెళ్లకుండా, ముఖ్యమంత్రి రేసులో ఉన్నామంటూ, కొందరు సీనియర్ల అతి విశ్వాసం కొంపముంచిందని, అది పార్టీని నమ్ముకున్న కేడర్‌ను ఇబ్బందులకు గురిచేసేందుకు కారణమైందని పేర్కొన్నారు.
పదవుల ధ్యాసేముంచింది
Published Wed, Jul 23 2014 2:52 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement