సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత, సీనియర్ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, అందుకు కారణాలు వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు నేరుగా బ్యాంకులతో మాట్లాడుకుందని, ఇప్పుడు వాయిదాల పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంతో ఈ పరిస్థితి ఎదురైందని వివరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోవాలని సోనియా చెప్పారని డీఎస్ తెలిపారు. నేతలంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆమె సూచించినట్టు చెప్పారు.