ఎన్నికల లోపే తెలంగాణ
ఢిల్లీ: 2014 ఎన్నికల లోపే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత అంశాలపై చర్చించేందుకు సోనియాను కలిసినట్లు చెప్పారు.
తెలంగాణకు సంబంధించే కాకుండా, సీమాంధ్రకు సంబధించిన రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. 2009లో కేంద్రం ప్రకటించిన తెలంగాణ ప్రక్రియకు కొనసాగింపుగానే ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. బీజేపీ కూడా పార్లమెంట్లో తెలంగాణకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని చెప్పారు.