సార్.. చాంబర్ ఎక్కడ? | sir where is my chamber in Secretariat? | Sakshi
Sakshi News home page

సార్.. చాంబర్ ఎక్కడ?

Published Mon, Aug 24 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

సార్.. చాంబర్ ఎక్కడ?

సార్.. చాంబర్ ఎక్కడ?

సచివాలయంలో డీఎస్ కోసం కార్యాలయం వెతుకులాట
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన డి.శ్రీనివాస్‌కు ఎక్కడ కార్యాలయం కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచనలతో సాధారణ పరిపాలనా శాఖ అధికారులు ఈ పనిలో పడ్డారు. సీ, డీ బ్లాక్‌లలో ఎక్కడెక్కడ ఖాళీ గదులున్నాయి? ఎవరెవరి కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయి..? అనే వివరాలను సేకరించారు.

ఈ రెండు బ్లాక్‌లలో ఇటీవల పార్లమెంటరీ కార్యదర్శులకు కేటాయించిన ఆఫీసులు ఖాళీగా ఉంటున్నాయి. ప్రొటోకాల్ తొలగించటం, జీత భత్యాలు నిలిపివేయటంలో పార్లమెంటరీ కార్యదర్శులు ఆఫీసులకు రావటం లేదు. వీటిలో డీఎస్ కోరుకున్న చాంబర్‌ను కేటాయించే అవకాశాలు లేకపోలేదు. కానీ  పార్లమెంటరీ కార్యదర్శులు 3 నెలల ముచ్చట తీరకముందే పదవులకు దూరమయ్యారు. దీంతో డీఎస్ సన్నిహితులు వీటిని తీసుకోవద్దని వారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయన అనుచరులు డీ బ్లాక్‌లో వాస్తుకు అనుగుణంగా ఉన్న కార్యాలయాలను వెతికే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement