Chamber
-
అలనాటి అద్భుతం.. 5,600 ఏళ్ల నాటి సమాధుల దిబ్బ
కొత్త రాతియుగానికి చెందిన సమాధుల దిబ్బ ఒకటి స్పెయిన్‌లో వెలుగు చూసింది. 5,600 ఏళ్ల నాటి ఈ కట్టడంలో అత్యంత భారీ పరిమాణంలో ఉన్న 32 ఏక శిలలను ఉపయోగించడం విశేషం! అవి ఒక్కోటీ కనీసం రెండు జెంబో జెట్ విమానాలంత తూగుతాయట. కొత్త రాతియుగం నాటి అద్భుతంగా చెప్పుకునే బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్‌లో వాడిన రాళ్లకంటే ఇవి పరిమాణంలో చాలా పెద్దవి. వీటిలో అతి పెద్ద రాయి అయితే ఏకంగా 150 టన్నుల బరువుంది. ఇది అతి పెద్ద జీవి అయిన నీలి తిమింగలం బరువుతో సమానం. స్టోన్‌హెంజ్‌లోని అతి పెద్ద శిల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ! ఇక 32 రాళ్లూ కలిపి 1,140 టన్నులుంటాయట. ఇవి సగటున 25 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇది దక్షిణ స్పెయిన్‌లోని మెంగా ప్రాంతంలో ఒక చిన్న గుట్టపై ఉన్న ఈ కట్టడాన్ని మెంగా డోల్మెన్గా పిలుస్తున్నారు. అంటే సమాధుల దిబ్బ అని అర్థం. అయితే ఇది సమాధి కాకపోవచ్చని, బహుశా ప్రార్థనా స్థలం కావచ్చని కూడా ఒక అభిప్రాయముంది. నిర్దిష్టమైన వరుసలో రాళ్లను నిటారుగా నిలిపి, వాటిపై రాళ్లను పరచడం ద్వారా దీన్ని నిర్మించారు. ఇంత భారీ శిలలను గుట్టపైకి తీసుకెళ్లేంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞనం ఆనాటి మనుషులకు ఎలా తెలుసన్నది అంతుచిక్కడం లేదన్నారు స్పెయిన్‌లోని సెవిల్లే యూనివర్సిటీ పూర్వచరిత్ర విభాగ ప్రొఫెసర్ లియొనార్డో గ్రాకా సంజున్. దీనిపై వెలువరించిన పరిశోధన పత్రానికి ఆయన సహ రచయిత. ఈ పేపర్‌ను జర్నల్ సైన్స్‌లో తాజాగా ప్రచురించారు. ‘‘ఇది ప్రపంచంలోని పురాతన రాతి కట్టడాల్లోకెల్లా అతి గొప్ప అద్భుతం. కొత్త రాతియుగపు మానవుల శాస్త్ర సాంకేతిక ప్రజ్ఞకు అత్యుత్తమ తార్కాణం’’ అని పరిశోధన బృందం అంటోంది. ‘‘మనిషి అప్పుడప్పుడే వ్యవసాయం నేర్చుకుంటున్నాడు. అన్ని అవసరాలకూ రాతినే వాడుతున్నాడు. లోహపు పనిముట్ల కాలం ఇంకా రాలేదు. మనిషి కనీసం భాష కూడా నేర్వని కాలమది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఈ డోల్మెన్ నిర్మాణం ఎంత గొప్ప ఘనతో అర్థమవుతుంది’’ అని చెప్పుకొచి్చంది. వారికి అప్పటికే రాళ్ల లక్షణాలు, కోణాలతో పాటు భౌతిక శాస్త్రం గురించిన అవగాహన కూడా ఉండి ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.కచ్చితమైన కొలతలు..ఈ నిర్మాణంలో చుట్టూ నిటారుగా పేర్చిన రాళ్లు లోపలివైపుకు నిర్దిష్ట కోణంలో వాలి ఉన్నాయి. దాంతో లోపలి ఖాళీ భాగం కింద విశాలంగా, పైకప్పుకు వెళ్లేకొద్దీ చిన్నగా ఉంది. వాటిపై ఐదు భారీ రాళ్లను పైకప్పుగా పరిచారు. ఎండ, వాన, చలి వంటివాటిని తట్టుకునేందుకు వీలుగా రాళ్ల మధ్య దట్టమైన మట్టి పూత పూశారు. ‘‘కొలతలన్నీ కచ్చితత్వంతో కూడుకుని ఉన్నాయి. ఇలా కట్టాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక పరికరాలు కూడా తప్పనిసరి’’ అని పరిశోధన బృందం చెప్పుకొచి్చంది. నిర్మాణంలో వాడిన రాళ్లను అక్కడికి 850 మీటర్ల దూరంలోని క్వారీ నుంచి తొలిచి తరలించినట్టు తేల్చారు. -
మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది.ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి.ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు.46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే.. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా.👉పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. 👉అయితే.. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.👉భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.👉ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే.. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. 👉జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి. 👉కాగా, 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1982 – 1985 సంవత్సరాలలో రత్న భండాగారం తెరచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు.👉జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.👉రఘుబీర్ కమిటీ నివేదికపై జులై 10లోగా స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రాజకీయం చేయొద్దని బీజేడీ కోరినా.. బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈలోపే ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిపించేందుకు సిద్ధమైంది.👉ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో.. ఈ నెల 14న(ఆదివారం) రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫార్సు చేసింది.👉జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను బిశ్వనాథ్ కమిటీనే తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో.. రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది. -
కేసీఆర్‌కు ఈ చాంబర్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఇన్నర్ లాబీలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏళ్ల తరబడి కేటాయిస్తూ వస్తున్న చాంబర్‌ను తొలగించి తాజాగా కె.చంద్రశేఖరరావుకు ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాల తొలిరోజున గురువారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ చాంబర్‌కు వెళ్లి తమ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ చాంబర్‌ను మార్చడాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ఇన్నర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక చాంబర్‌ను కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్‌ను ఔటర్ లాబీకి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన పలు సంఘటలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి భార్య వచ్చేంత వరకు సుమారు రెండు గంటల పాటు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారన్నారు. నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్ తదితర నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులను పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో అనుసరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అధికారులను ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. పని చేయని టీవీ.. డోర్ హ్యాండిల్ లేని బాత్ రూం గతంలో ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్‌కు కూడా చాంబర్‌ను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్నర్ చాంబర్‌లోని ప్రతిపక్ష నేత చాంబర్‌ను తాను వాడుకుంటానని స్పీకర్ కోరడంతో ఔటర్ లాబీకి తన కార్యాలయాన్ని తరలించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గది కేటాయించారని, అందులోని మూత్రశాలకు కనీసం డోర్ హ్యాండిల్ లేదనీ, టీవీ పనిచేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారు. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడం లాంటిదేనని, విశాలమైన చాంబర్‌ను కేటాయించాలని కోరారు. వచ్చే సెషన్‌లోగా ప్రతిపక్ష నేత చాంబర్‌ను విశాలంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. -
అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ మార్చిన ప్రభుత్వం
-
గురక శబ్ధంతో వీడిన వ్యభిచార ముఠా గుట్టు
బెంగళూరు: అప్పట్లో.. రాజులు యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివి ఉంటాం. సాధారణంగా.. ఐటీ రైడింగ్‌లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్ గదుల్లోనూ, వాటర్ ట్యాంక్‌ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ, టాయిలెట్లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ముఠా ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఈమధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో వెతికినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలోని బాత్రూమ్ను పరిశీలించగా.. ఒకచోట నుంచి గురక శబ్దం వినిపించింది. శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించిన ఓ అధికారికి.. టైల్స్ నుంచి రావడం వినిపించింది. అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే.. అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది. పోలీసులు గదిని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. -
మూగబోయిన మంత్రి గౌతమ్ రెడ్డి ఛాంబర్
-
గాలి పీల్చుకోవడానికి రూ.15 లక్షలు ఖర్చు చేసిన రొనాల్డో
అదేంటీ వాతావరణంలోని పుక్కిడికి దొరికే గాలిని పీల్చుకోవడానికి స్వేచ్ఛ ఉంది కదా! అంతేసి ఖర్చు ఎందుకు? దండగ కాకపోతే.. అనుకుంటున్నారా?. ఆ గాలికి చాలా ప్రత్యేకత ఉంటుంది మరి. ప్యూర్ ఎయిర్‌గా పేరున్న ఈ మెషిన్ కోసం సాకర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో భారీగానే ఖర్చుపెట్టాడు. ఇంతకీ దాని ఖర్చెంతో.. ప్రత్యేకతలేంటో తెలుసా? హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT) మెషిన్ ఖరీదు 15,000 పౌండ్లు. మన కరెన్సీలో 15 లక్షల రూపాయలపైనే. ఈ డివైజ్ ప్రత్యేకత ఏంటంటే.. ప్యూర్ ఆక్సిజన్‌ను రక్తంలోకి సరఫరా చేస్తుంది. తద్వారా రక్తపు ప్లాస్మాలోని దెబ్బతిన్న కణజాలం క్యూర్ అయిపోతుంది. ఫిట్‌నెస్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చే 36 ఏళ్ల రొనాల్డో.. ఈ ఛాంబర్‌ను తన జిమ్ రూంలో ఈ మధ్యే ఏర్పాటు చేయించాడు. చిన్నచిన్నగాయాలకు సైతం మ్యాచ్‌లకు దూరం అయ్యే రొనాల్డ్.. ఇలాంటి హైటెక్ చికిత్సల ద్వారా తరచూ ఉపశమనం పొందుతాడట. వాస్తవానికి రొనాల్డో ఇలాంటి ఛాంబర్లను ఉపయోగించడం కొత్తేం కాదు. 2016లో యూరో ఫైనల్లో తగిలిన మోకాలి గాయం తర్వాత స్పానిష్ ఐల్యాండ్ ఇబిజాకు వెళ్లి.. ఇలాంటి ఛాంబర్‌లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ, యూకేలో అలాంటి మెషిన్లు దొరక్కపోవడంతో కొని.. చెషైర్‌లోని తన ఇంట్లో ఇన్స్టాల్ చేయించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది 50 వేల పౌండ్లు ఖర్చు పెట్టి ఐస్ ఛాంబర్‌ను కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ సాకర్ ప్లేయర్‌గా పేరున్న రొనాల్డోతో మామూలుగా ఉండదు మరి!. ఛాంబర్ ప్రత్యేకతలు చిన్న ఛాంబర్ లాంటి గది ఉంటుంది. డ్రైవింగ్ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ల కోసం రూపొందించినప్పటికీ.. రకరకాల జబ్బులు ఉన్నవాళ్లు తమకు నయం కావడానికి ఈ చికిత్సను ఆశ్రయిస్తుంటారు. ఈ లిస్ట్‌లో సెలబ్రిటీలు కూడా ఎక్కువ!. 1662లో ఓ ఫిజీషియన్ ఈ తరహా ఛాంబర్ ఒకటి స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. 1940లో మిలిటరీ డైవర్స్ కోసం అమెరికా దేశం HBOT ఎక్కువ స్థాయిలో తయారు చేయించింది. అనుమతులు పొందాకే వీటిని వాడాల్సి ఉంటుంది. HBOTలతో ఉపయోగాలే కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట. అందుకే వీటిని వినియోగించేముందు కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు మరి!. ఎక్కువ మంది ఒకేసారి ఈ చికిత్స తీసుకునేందుకు ప్రత్యేక గదులను సైతం ఏర్పాటు చేయిస్తుంటారు. ఈ ట్రీట్మెంట్కు కాస్ట్ ఎక్కువగా ఉంటోంది. చదవండి: రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం -
రాజమండ్రిలో డిస్ఇన్ఫెక్షన్ చాంబర్
-
గిజా పిరమిడ్ రహస్యం ఇదే..!
-
కొత్త సీఎం ఛాంబర్ ప్రారంభించిన చంద్రబాబు
-
కొత్త సీఎం ఛాంబర్ ప్రారంభించిన చంద్రబాబు
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో తన ఛాంబర్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. నిర్ణీత ముహూర్తానికి వేదపండితుల ఆధ్వర్యంలో సచివాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం లాంఛనంగా కొత్త ఆఫీసులోకి అగుడు పెట్టారు. ముందుగా ఆయన డ్వాక్రా మహిళలకు రెండో విడత రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులుమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా తమ కార్యాలయాన్ని ప్రారంభించారు. -
బీసీ సంక్షేమ శాఖలో బియ్యం పంచాయితీ
కేటాయింపుల్లో అవకతవకలపై నిలదీసిన ఏబీసీడబ్ల్యూఓ హన్మకొండ అర్బన్ : బీసీ సంక్షేమ శాఖలో నోటి దురుసుతో వివాదాస్పదమై విచారణ ఎదుర్కొంటున్న ఓ అధికారి తాజాగా అదే శాఖ డీడీ చాంబర్లో జరిగిన పర్యవేక్షకుల సమావేశంలోనూ అలాగే వ్యవహరించాడు. జిల్లాలోని బీసీ సంక్షేమశాఖ హాస్టళ్లకు నెలవారీ బియ్యం కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, దీంతో విద్యార్థులు, వార్డెన్లు ఇబ్బందుల పాలవుతున్నారని, ఏబీసీ డబ్ల్యూ వో సమావేశంలో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగా అక్కడే ఉన్న సదరు అధికారి ఏబీసీ డబ్ల్యూవోపై నోటి దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి దూషించుకున్నట్లు తెలిసింది. తన పై దురుసుగా మాట్లాడిన వారి విషయంలో ఉన్నతాధికారులు ఉదా సీనంగా వ్యవహరించడంపై ఏబీసీడబ్ల్యూవో అర్ధంతరంగా వెళ్లి పోయారు. దీనిపై కొందరు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చేపట్టే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. డీడీ నర్సింహస్వామిని వివరణ కోరగా అనవసరమైన చర్చ వల్ల మీటింగ్ పక్కదారి పట్టిందన్నారు. బియ్యం కేటాయింపుల్లో జరిగిన లోపాలను వచ్చే నెలలో సరిదిద్దుతామన్నా పట్టించుకోకపోవడంతో సమస్య పెద్దదైందని తెలిపారు. -
'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' పార్లమెంట్ రూల్
ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. పార్లమెంట్ ఛాంబర్లో మహిళా ఎంపీలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు అనుమతించింది. తల్లులు తమ పిల్లలకు పని వేళల్లోనే షెడ్యూల్ ప్రకారం పాలివ్వచ్చని తెలిపింది. కొత్తగా అమల్లోకి వచ్చిన 'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' పార్లమెంట్ రూల్‌తో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇంతకు ముందు పార్లమెంట్ ఛాంబర్లోకి పిల్లలను అనుమతించేవారు కాదు. అయితే ఇప్పుడా ఆ చట్టంలో మార్పులు తెచ్చారు. ఒక్క మహిళా ఎంపీలే కాదు... తల్లిదండ్రులు ఇద్దరిలో పిల్లల సంరక్షణను చూసే ఎవరైనా పిల్లలను తమతోపాటు ఛాంబర్లోకి తెచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ కొత్త ఉత్తర్వులు సభ్యులందరికీ వర్తించేలా అమల్లోకి తేనున్నారు. అయితే ఇక్కడి మొత్తం హౌస్‌లో 150 మంది సభ్యుల్లో 40 మంది మహిళలే ఉన్నారు. ద ఆడైనా, మగైనా పిలల సంరక్షణా బాధ్యత ఉన్నవారు పార్లమెంట్ నిర్వహణలో పాల్గొనలేకపోతారని, అందుకే ఇటువంటి అవకాశాన్ని కల్పించినట్లు సభాధ్యక్షుడు క్రిస్టోఫర్ పైన్ తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ఈ నిర్ణయాన్నిస్వాగతించారు. గతేడాది ఆస్ట్రేలియా పార్లమెంట్లో ముగ్గురు సభ్యులు ఇంచుమించుగా ఒకేసారి మాతృత్వం పొందడంతో ఇటువంటి ప్రత్యేక నిర్ణయం తీసుకోడానికి కారణంగా చెప్పొచ్చు. కాగా ఇటలీ మహిళ మెప్ లికా రొంజుల్లి 2010లో తన ఆరు వారాల బిడ్డను తీసుకొని ఓటింగ్‌లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె కుమార్తె ప్రతి చర్చలోనూ భాగమైంది. పనిచేసే చోటకి పిల్లలను అనుమతించే ఈ కొత్త చట్టాన్ని ఐరోపా సమాఖ్యలోని దేశాల్లో మొట్ట మొదటిగా ఆస్ట్రేలియా అమల్లోకి తెచ్చింది. -
38 బిలియన్ డాలర్లకి ఈ-కామర్స్!: అసోచామ్
న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ మార్కెట్ ఈ కొత్త ఏడాదిలో 38 బిలియన్ డాలర్లకి చేరవచ్చని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ పేర్కొంది. 2015లో దేశీ ఈ-కామర్స్ మార్కెట్ 23 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల, ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ మెరుగుదల వంటి అంశాలు ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయని వివరించింది. భారీ డిస్కౌంట్ ఆఫర్ల వల్ల గతేడాదిలో ఆన్లైన్ కొనుగోళ్లలో బలమైన వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్ విషయంలో ముంబై అగ్రస్థానంలో ఉందని, దీని తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా ఉన్నాయని తెలిపింది. టైర్-1, టైర్-2 పట్టణాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మొబైల్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. గతేడాది 78 శాతం షాపింగ్ సంబంధిత వివరాల సేకరణ మొైబె ళ్ల నుంచే జరిగిందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. 2014తో పోలిస్తే గతేడాది దుస్తుల విభాగంలో అధిక వృద్ధి (70 శాతం) నమోదయ్యింద ని, దీని తర్వాతి స్థానాల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు (62 శాతం), బేబీ కేర్ ప్రాడక్ట్స్ (53 శాతం), బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులు (52 శాతం), హోమ్ ఫర్నిచర్ (49 శాతం) ఉన్నాయని పేర్కొన్నారు. అసోచామ్ నివేదిక ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ చేసేవారిలో 45 శాతం మంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌కు ప్రాధాన్యమిస్తుంటే, క్రెడిట్ కార్డు పేమెంట్స్ మంచిదని 16 శాతం మంది, డెబిట్ కార్డు ఉత్తమమని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 10 శాతం మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను, 7 శాతం మంది మొబైల్ వాలెట్, క్యాష్ కార్డులను ఎంచుకున్నారు. ఆన్లైన్ షాపింగ్ చేసేవారిలో 18-25 ఏళ్ల మధ్యలో ఉన్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆన్లైన్ షాపింగ్ చేసేవారిలో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. గతేడాది ఎక్కువగా అమ్ముడుపోయిన వస్తువుల్లో మొబైల్స్, ఐపాడ్ ఉత్పత్తులు, ఎంపీ3 ప్లేయర్స్, డిజిటల్ కెమెరా, జ్యువెల్లరీ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. -
పిల్లల భవిత చల్లగా!
* ఉన్నత విద్య, వివాహాలకు పొదుపు తప్పనిసరి * పలు సాధనాల్లో మదుపు చేయటమే మంచిది మీకే కాదు! ఏ తల్లిదండ్రులకైనా పిల్లలే ప్రపంచం. ఆ ప్రపంచం చుట్టూ కలలు అల్లుకునేది కూడా తల్లిదండ్రులే. మరి ఈ కలల్ని నిజం చేసుకోవాలంటే..? ఇతరత్రా అంశాలతో పాటు ఆర్థికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ వారి నిత్యావసరాల నుంచి చదువు దాకా అన్నీ ముడిపడి ఉన్నది డబ్బుతోనే. విద్యా సంబంధమైన ఖర్చులు పెరుగుతున్న తీరు మనకు తెలియంది కూడా కాదు. అసోచామ్ అంచనా ప్రకారం... గడిచిన పదేళ్లలో విద్యా సంబంధ ఖర్చులు ఏకంగా 150 శాతం పెరిగాయి. మున్ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందన్నది నిపుణుల మాట. దీనర్థం... మీ పిల్లలకోసం ఇన్వెస్ట్ చేయటమన్నది తప్పనిసరి ప్రాధాన్యం. సరే! మరి ఈ పొదుపు, పెట్టుబడికి సరైన పథకాలేంటి? నిజానికిది ఎప్పటికీ చిక్కు ప్రశ్నే. ఒకో సమయంలో ఒకో రకమైన సాధనాలు అందుబాటులోకి వస్తుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలను విశ్లేషించినపుడు ఏఏ పథకాలు మెరుగైనవిగా తేలాయంటే... బంగారంపై పెట్టుబడి మార్కెట్లు భారీ కుదుపులకు లోనవుతున్న తరుణంలో బంగారంపై దీర్ఘకాలిక పెట్టుబడులనేవి సురక్షిత సాధనంగా పనికొస్తాయి. ‘‘బంగారంలో పెట్టుబడులను ఈటీఎఫ్‌ల ద్వారా, గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్ల ద్వారా, ఈ-గోల్డ్ ద్వారా చేయొచ్చు. అయితే భౌతికంగా బంగారం కొనటం మాత్రం సరైన పెట్టుబడి మార్గం కాదనే చెప్పాలి. ఎందుకంటే దీన్ని దాచటం సమస్యే. పెపైచ్చు తరుగు కూడా పోతుంటుంది. పేపర్ గోల్డ్ గనక కొంటే అది మార్కెట్ ధరకే దొరుకుతుంది కనక అది కూడా బంగారాన్ని కొన్నట్టే. గోల్డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినా అంతే’’ అని ‘జెన్ మనీ’ కమాడిటీ నిపుణుడు ఆర్.నమశ్శివాయ తెలియజేశారు. కాగా మీ పోర్టుఫోలియోలో బంగారంపై పెట్టే మొత్తం 10 నుంచి 15 శాతం మించకుండా చూసుకోవటం ఉత్తమం’’ అని ఆయన వివరించారు. భవిష్యత్తు లక్ష్యాల రక్షణ తప్పనిసరి! అనుకోని దుర్ఘటనలు జరిగినా కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇబ్బంది రాకూడదని భావిస్తే అందుకు తగ్గ బీమా రిస్కు కవరేజీ కూడా తీసుకోవాలని జెన్ మనీకి చెందిన ఫైనాన్షియల్ అనలిస్టు జాగర్లమూడి వేణుగోపాల్ చెప్పారు. ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్లు నిజానికి ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్లనేవి ప్రాధాన్యంలో ఎప్పుడూ ముందే ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణాలేంటంటే... ఇన్వెస్ట్‌మెంట్‌కు పది నుంచి 15 ఏళ్ల దీర్ఘ కాలం వ్యవధి ఉండటం. రెండు... క్రమంగా పెట్టుబడి పెట్టేందుకు సిప్ వంటి విధానం అందుబాటులో ఉండటం. ‘‘నెలకు రూ.5వేల చొప్పున వరసగా 18 ఏళ్ల పాటు సిప్ పద్ధతిలో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అది ఏకంగా రూ.33 లక్షలయ్యే అవకాశం ఉంటుంది. ఏడాదికి 12 శాతం రాబడిని అంచనా వేయటంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు కూడా. ఏడాదికి 6 శాతం చొప్పున ద్రవ్యోల్బణం పెరుగుతుందని అనుకున్నా... ఈ మొత్తం దాన్ని అధిగమిస్తుంది. కాకపోతే ఇందులో ప్రధానమైనది ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నామనేది కాదు. ఎన్నాళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తున్నామనేది. కాంపౌండింగ్‌కు ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. దీర్ఘకాలంలో 12 నుంచి 15 శాతం రాబడులనిచ్చిన చరిత్ర ఈక్విటీ ఫండ్లకుంది. పెపైచ్చు దీర్ఘకాలంలో మీ ఖర్చును యావరేజ్ చేయడానికి సిప్‌ను మించిన విధానం లేదు కూడా’’ అని హైదరాబాద్‌లోని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవీరెడ్డి వివరించారు. పీపీఎఫ్ చాలామంది నిపుణులు దీన్నే తమకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనంగా పేర్కొన్నారు. ఎందుకంటే దీనికి వేలు పెట్టడానికి వీల్లేని ‘ఇఇఇ’ ఫీచర్ ఉంది. ట్రిపుల్ ఇ... అంటే ఇన్వెస్ట్ చేసేటపుడు గానీ, వడ్డీపై గానీ, మెచ్యూరిటీ మొత్తంపై గానీ ఎక్కడా పన్ను లేకపోవటమన్న మాట. పెపైచ్చు దీని కాల వ్యవధి 15 సంవత్సరాలు. అంటే.. పిల్లల చదువుకు గానీ, వివాహానికి గానీ సరిగ్గా సరిపోయే సమయం. దీన్లో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ ఏంటంటే... సరళమైన పెట్టుబడి విధానం. కనిష్ఠంగా ఏడాదికి రూ.500 కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అది కూడా మీకు కుదిరిన సమయంలో. కాకపోతే ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షలకు మించి మాత్రం పెట్టుబడి పెట్టే అవకాశం లేదు. పిల్లల పేరుతో పాటు మీ ఖాతా నుంచి మీ పేరిట కూడా పెట్టుబడి పెట్టిన పక్షంలో... రెండు ఖాతాల కింద రూ.3 లక్షల దాకా పెట్టుబడి పెట్టొచ్చు. స్వల్పకాలానికి డెట్ సాధనాలు... స్వల్ప, మధ్యకాలిక అవసరాల కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయలేం. ఎందుకంటే అక్కడ హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయి. ‘‘మార్కెట్ రిస్కుకు దూరంగా ఉండటానికి స్వల్పకాలిక ఫండ్లు, ఇన్కమ్ ఫండ్లు, బాండ్ ఫండ్లు (తక్కువ వ్యవధి) వంటి డెట్ సాధనాల్ని పరిశీలించవచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేయటం వల్ల రాబడి శాతం 6 నుంచి 8 మించకపోవచ్చు. కాకపోతే రిస్కు కూడా చాలా తక్కువగా ఉంటుంది’’ అని వేణుగోపాల్ వివరించారు. వీటన్నిటితో పాటు మీ పిల్లలకు డబ్బు ప్రాధాన్యం గురించి తెలియజేయండం ఎంతో ప్రయోజనకరం. సుకన్య సమృద్ధి పథకం... ఆడపిల్లల చదువు కోసం కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన పథకమిది. ఈ పథకాన్ని మీ అమ్మాయి పుట్టినప్పటి నుంచి తనకు పదేళ్ల వయసు వచ్చేదాకా ఎప్పుడైనా ఆరంభించొచ్చు. పదేళ్లు దాటిన అమ్మాయిలున్నా, లేకపోతే అబ్బాయిల తల్లిదండ్రులైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కుదరదు. ఏడాదికి కనీసం రూ.వెయ్యి నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా వరసగా 14 ఏళ్లపాటు చేయొచ్చు. ఈ పథకం కింద ఖాతా తె రిచిన 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ సొమ్ము చేతికొస్తుంది. ఏడాదికి 9.2 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తారు. కాకపోతే పీపీఎఫ్ మాదిరిగా దీనిపై కూడా వడ్డీ రేటు మారే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడులకు సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన పక్షంలో పాక్షికంగా విత్‌డ్రాయల్ చేసుకోవటానికి అనుమతి ఉంటుంది. -
రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్‌కు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన టీఆర్ఎస్ నేత డి. శ్రీనివాస్ కు ఎట్టకేలకు ఛాంబర్ కేటాయించారు. సలహాదారుగా నియామకం ఖరారయి పదిరోజులు కావస్తున్నప్పటికీ ఛాంబర్ కేటాయింపులో ఏర్పడిన జాప్యం వల్లే బాధ్యతల స్వీకారానికి ఆయన దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సచివాలయంలోని డీ బ్లాక్ మొదటి అంతస్తులో డీఎస్ కు పేషీని కేటాయిస్తూ సాధారణ పరిపాలనా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసి, అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన టి రాజయ్య ఇదే ఛాంబర్ నుంచి విధులు నిర్వర్తించారు, ఛాంబర్ కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో శుక్రవారం (ఆగస్టు 28న) డీఎస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
సార్.. చాంబర్ ఎక్కడ?
సచివాలయంలో డీఎస్ కోసం కార్యాలయం వెతుకులాట సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన డి.శ్రీనివాస్‌కు ఎక్కడ కార్యాలయం కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచనలతో సాధారణ పరిపాలనా శాఖ అధికారులు ఈ పనిలో పడ్డారు. సీ, డీ బ్లాక్‌లలో ఎక్కడెక్కడ ఖాళీ గదులున్నాయి? ఎవరెవరి కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయి..? అనే వివరాలను సేకరించారు. ఈ రెండు బ్లాక్‌లలో ఇటీవల పార్లమెంటరీ కార్యదర్శులకు కేటాయించిన ఆఫీసులు ఖాళీగా ఉంటున్నాయి. ప్రొటోకాల్ తొలగించటం, జీత భత్యాలు నిలిపివేయటంలో పార్లమెంటరీ కార్యదర్శులు ఆఫీసులకు రావటం లేదు. వీటిలో డీఎస్ కోరుకున్న చాంబర్‌ను కేటాయించే అవకాశాలు లేకపోలేదు. కానీ పార్లమెంటరీ కార్యదర్శులు 3 నెలల ముచ్చట తీరకముందే పదవులకు దూరమయ్యారు. దీంతో డీఎస్ సన్నిహితులు వీటిని తీసుకోవద్దని వారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయన అనుచరులు డీ బ్లాక్‌లో వాస్తుకు అనుగుణంగా ఉన్న కార్యాలయాలను వెతికే పనిలో పడ్డారు. -
టీఎస్పీఎస్సీ చాంబర్ స్వాధీనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారులు అక్రమంగా తమ కార్యాలయంలోని చాంబర్‌ను స్వాధీనం చేసుకున్నారంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీసులు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా రెండుగా విభజించారు. 2వ, 3వ అంతస్తులో టీఎస్పీఎస్సీ, 4వ, 5వ అంతస్తులో ఏపీపీఎస్సీ కొనసాగుతున్నాయి. కాగా 5వ అంతస్తులోని ఒక గదిలో టీఎస్పీఎస్సీకి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ సీతాదేవి చాంబర్ ఉంది. కార్యాలయంలోని చాంబర్‌ను ఏపీపీఎస్సీ అధికారులు నకిలీ తాళం చెవితో తెరిచి గదిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనకు సమాచారం ఇవ్వకుండా చాంబర్‌ను తెరిచారంటూ సీతాదేవి టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యంకు సమాచారం ఇచ్చారు. ఆమె దీనిపై బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ చాంబర్‌ను తెరవడమే కాకుండా అందులోని విలువైన పత్రాలను కూడా మాయంచే సి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జి.శ్రీధర్ తెలిపారు. -
నోటిఫికేషన్ విడుదల
మహబూబ్‌నగర్ టౌన్ : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ రాంకిషన్ గురువారం తన చాంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణ ఈనెల 26వరకు కొనసాగుతుంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎస్సీ , ఎస్టీలైతే *.10వేలు, ఇతరులైతే *5 వేలు చెల్లించి నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. మూడు జిల్లాలకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులంతా జీహెచ్ఎంసీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్లను అందించాల్సి ఉంటుంది. ఇక 27న నామినేషన్ల పరిశీలనతోపాటు, ఉపసంహరణ మార్చి 2న చేపట్టనున్నారు. ఏర్పాట్లు పూర్తి ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తిచేశారు. మార్చి 16న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకుగాను జిల్లాలో 97పోలింగ్ కేంద్రాలను అధికారికంగా గుర్తించారు. అయితే వెయ్యికి పైగా ఓట్లుండగా, పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని సీఈఓ బన్వర్‌లాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరో 17పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. మార్చి 19న కౌంటింగ్‌ను హైదరాబాద్‌లోనే చేయనున్నారు. ఓటరు నమోదుకు ముగిసిన గడువు పట్టభద్రులకు సంబంధించి కొత్త వారికి కల్పించిన నమోదు అవకాశం గురువారంతో ముగిసింది. గడువు ముగిసే నాటికి 4వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల అంచనా. ఇంత వరకు 66,650మంది ఓటర్లు ఉండగా, కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఎంత మందికి అవకాశం వస్తోందో ఆ ప్రకారం జాబితా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
చాంబర్ కోసం మంత్రుల మధ్య పేచీ..!
ఒకే చాంబర్ కోసం పట్టుబడుతున్న ఇద్దరు కార్యాలయం చూస్తామని తాళంచెవి తీసుకున్న మంత్రి బంధువులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ‘డీ’ బ్లాక్‌లోని ఒక చాంబర్ కోసం ఇద్దరు మంత్రులు పోటీపడుతున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పి కలిగిస్తోంది. చాంబర్ల కేటాయింపు అధికారం ముఖ్యమంత్రిదే అయినా, ఒక మంత్రి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చాంబర్ చూడడం కోసం తాళాలు తీసుకున్న మంత్రి సంబంధీకులు ఆ తాళాలు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. దీంతో కార్యాలయం అధికారికంగా కేటాయించకుండా అందులో కూర్చోవడానికి వీల్లేదని, అలా చేయడం సరికాదని ఆ అధికారి స్పష్టం చేయడంతో సదరుమంత్రి సంబంధీకులు ఆ తాళం చెవులు తిరిగి ఇచ్చినా..అర్ధరాత్రి సమయంలో ఫోన్‌చేసి నానా గొడవ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ మంత్రులకు సచివాలయంలోని‘డీ’ బ్లాక్‌లో చాంబర్లను కేటాయిస్తున్నారు. ఈనెల 16 న జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులుగా పదవీస్వీకార ప్రమాణం చేసిన సంగతి విదితమే. అయితే ఇందులో ఇద్దరు మంత్రులు ‘డీ’ బ్లాక్‌లోని రెండో అంతస్తులోని రూమ్ నంబర్ 260ని తమకు కేటాయించాలంటూ పట్టుబడుతున్నారు. గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే చాంబర్‌ను కోరుతున్నట్టు తెలిసింది. కాగా, ఈ చాంబర్‌ను పరిశీలిస్తామంటూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి బంధువులు తాళం చెవులు తీసుకుని వెళ్లారు. ఆ చాంబర్‌ను తమకే కేటాయించాలంటూ పట్టుబట్టడంతో సదరు అధికారి.. చాంబర్ల కేటాయింపు తమ పరిధిలో లేదని, ముఖ్యమంత్రే ఆమోద ముద్రవేయాల్సి ఉంటుందని, ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు కావాల్సిన చాంబర్ తీసుకోవచ్చని సూచించినప్పటికీ వినకుండా సదరు మంత్రి కుమారుడు శుక్రవారం రాత్రి ఫోన్లోనే తిట్లదండకం అందుకున్నట్టు తెలిసింది. ‘నీవు తుమ్మలకు తొత్తుగా వ్యవహరిస్తున్నావు.. ఏమనుకున్నావో సస్పెండ్ చేయిస్తా...మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది. కుమారునితోపాటు మంత్రి కూడా ఆ అధికారిపై మండిపడ్డట్టు తెలిసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్టు తెలిసింది. చాంబర్ కోరింది వాస్తవం: చందూలాల్ సచివాలయం ‘డీ’ బ్లాక్‌లోని చాంబర్ నంబర్ 260ను కోరిన మాట వాస్తవమేనని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ చెప్పారు. అనువుగా ఉంటుందని ఆ చాంబర్ కోరానని, తనతోపాటు మరో ముగ్గురు మంత్రులు కూడా అదే చాంబర్ కోరినట్టు ఆయన తెలిపారు. అయితే దీనిపై ఎలాంటి వివాదం చేయలేదని ఆయన పేర్కొన్నారు. -
3నెలల్లో సీఎం కార్యాలయం పూర్తి
హైదరాబాద్ : వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పూర్తిస్థాయిలో పాలన ప్రారంభిస్తామని ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ మూడు నెలల్లో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈనెల 14న ఆలిండియా సర్విసెస్ విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం కానున్నట్లు ఐవైఆర్ తెలిపారు. కాగా చంద్రబాబు తన చాంబర్ కోసం సచివాలయంలోని ఎల్ బ్లాకులో ఎనిమిదో అంతస్తును ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా చాంబర్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తోంది. ఎల్ బ్లాకులోని 8వ అంతస్తులో ముఖ్యమంత్రి, 7వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల కోసం ఇప్పటికే ఉన్న భవనంలో పది కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు కొత్త సీఎం కోసం హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి సర్వహంగులూ పూర్తి చేశారు. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన సన్నిహితులు, జ్యోతిష్యులు దాన్ని పరిశీలించి వాస్తు సరిగా లేదంటూ.. సీఎం కోసం ఎల్ బ్లాకును ఎంపిక చేశారు. దాంతో హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం వెచ్చించిన రూ. 3 కోట్లు వృథా అయ్యాయి. అలాగే.. చంద్రబాబు క్యాంపు కార్యాలయం కోసం లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కేటాయించగా.. తొలుత అక్కడికి కూడా వెళ్లబోనని ఆయన అధికారులకు సమాచారం పంపించారు. దాంతో అధికారులు ఆయన కోరిన మరో చోట క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా చివరకు లేక్‌వ్యూనే ఎంచుకున్నారు. -
బాబు చాంబర్ ఆధునీకరణ ఖర్చు 10 కోట్లు
-
బాబు చాంబర్ ఆధునీకరణ ఖర్చు 10 కోట్లు
* బాబు కోసం భలే హంగు * ముఖ్యమంత్రి చాంబర్ ఆధునీకరణ ఖర్చు రూ. 10 కోట్లు * సచివాలయం ఎల్ బ్లాకు 8వ అంతస్తులో ఆర్భాటంగా ఏర్పాట్లు * ఇంతకుముందు హెచ్ బ్లాక్‌లో చాంబర్‌కు రూ. 3 కోట్ల వ్యయం * వాస్తు పేరుతో బాబు నిరాకరించటంతో ఆ సొమ్మంతా వృథా * రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పొదుపు చేయాలని పిలుపు.. ఆర్భాటాలపై భారీ వ్యయం సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలి.. ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు పాటించాలి...’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు స్వీకరిస్తూనే ఇచ్చిన పిలుపు ఇది! మరి స్వయానా ముఖ్యమంత్రే పాటిస్తున్న పొదుపు తీరును చూస్తే.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి! ‘సాధ్యమైనంత త్వరగా మన రాష్ట్రానికి వెళ్లిపోదాం...’ అని చెప్తున్న చంద్రబాబునాయుడు.. తాత్కాలిక రాజధాని హైదరాబాద్‌లోని సచివాలయంలో తన చాంబర్ ఆధునీకరణ కోసం కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుచేస్తున్నారు మరి!! తొమ్మిదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటానికి ఒక్క రోజు కోసం రూ. 30 కోట్లు ఖర్చుపెట్టినపుడు.. పది నెలలో ఆ పైనో తను ఉపయోగించుకునే చాంబర్లో వసతుల కోసం రూ. 10 కోట్లు మాత్రమే ఖర్చుపెడుతున్నారంటే.. ఎంత పొదుపు పాటిస్తున్నట్లో కాదా?! కానీ.. సచివాలయ ఉద్యోగులు మాత్రం.. రేపో మాపో వదిలి వెళ్లిపోయే చాంబర్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు దుబారా చేయటమేమిటని విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన చాంబర్ కోసం సచివాలయంలోని ఎల్ బ్లాకులో ఎనిమిదో అంతస్తును ఎంచుకున్నారు. ఇప్పుడా చాంబర్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తోంది. ఎల్ బ్లాకులోని 8వ అంతస్తులో ముఖ్యమంత్రి, 7వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల కోసం ఇప్పటికే ఉన్న భవనంలో పది కోట్ల రూపాయలు వెచ్చించి ఏం ఏర్పాట్లు చేస్తున్నట్టు అని సచివాలయంలోని ఉద్యోగులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కార్యాలయాల కోసం సౌకర్యాల కల్పన, ఫర్నిచర్ కోసం రహదారులు - భవనాల శాఖ పది కోట్ల రూపాయలను (జీవో ఆర్టీ నంబర్ 541) విడుదల చేసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించడంతో ఆ శాఖ స్వల్పకాలిక టెండర్లతో పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించి మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎక్కడో నిర్ణయించిన తర్వాత సాధ్యమైనంత తొందరగా అక్కడికి మారాలని భావిస్తున్న దశలో.. సీఎం చంద్రబాబు తాత్కాలిక చాంబర్లో సౌకర్యాలు, ఫర్నిచర్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించడం ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్‌గా మారింది. పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అసలు కొత్తగా క్యాంపు కార్యాలయమే నిర్మించవచ్చని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. హెచ్ బ్లాక్‌లో రూ. 3 కోట్ల ఖర్చు వృథా... రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టే సీఎం కోసం సచివాలయంలోని హెచ్ బ్లాక్ సరిగ్గా సరిపోతుందని భావించారు. గవర్నర్ ఆదేశాల మేరకు కొత్త సీఎం కోసం హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి సర్వహంగులూ పూర్తి చేశారు. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన సన్నిహితులు, జ్యోతిష్యులు దాన్ని పరిశీలించి వాస్తు సరిగా లేదంటూ.. సీఎం కోసం ఎల్ బ్లాకును ఎంపిక చేశారు. దాంతో హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం వెచ్చించిన రూ. 3 కోట్లు వృథా అయ్యాయి. అలాగే.. చంద్రబాబు క్యాంపు కార్యాలయం కోసం లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కేటాయించగా.. తొలుత అక్కడికి కూడా వెళ్లబోనని ఆయన అధికారులకు సమాచారం పంపించారు. దాంతో అధికారులు ఆయన కోరిన మరో చోట క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా చివరకు లేక్‌వ్యూనే ఎంచుకున్నారు. పొదుపు చేయాలంటూ ఇంత దుబారానా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం నిధులు లేవంటూ విరాళాలు ఇవ్వాలని ఒకవైపు ప్రజలను కోరిన చంద్రబాబు తాత్కాలికంగా పనిచేసే తన పేషీ కోసం పది కోట్లు వెచ్చించడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున విరాళాలు కోరడమే కాకుండా ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా అకౌంట్‌ను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని పరిస్థితుల్లో పొదుపు పాటించాలని మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వమే అనవసరపు ఆర్భాటాలు చేయటమేమిటని సచివాలయం ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సీఎం కోసం నాలుగు కోట్లు వెచ్చింది శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం, అధికారిక నివాస గృహం రెండింటినీ నిర్మిస్తే గగ్గోలు పెట్టిన వారే.. హెచ్ బ్లాకులోనూ రూ. 3 కోట్ల వ్యయంతో అధునాతన సదుపాయాలతో సర్వం సిద్ధం చేసిన తర్వాత వాస్తు కారణం చూపి ఎల్ బ్లాకులో కొత్త కార్యాలయం కోసం ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చిస్తుండటం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత హైదరాబాద్‌ను వీడి వెళ్లాల్సి ఉన్నందున ఇక్కడ ఎలాంటినిర్మాణాలు చేపట్టినా, వాటిని వదిలి వెళ్లాల్సిందనే ఆలోచనను ప్రభుత్వం విస్మరిస్తోందని ఉన్నతాధికారులు తప్పుపడుతున్నారు. ఇంతకూ రూ. 10 కోట్లతో ఎల్ బ్లాకులో 7, 8 అంతస్తుల్లో ఏం చేస్తున్నారంటే.. * విశాలమైన హాలు కోసం మధ్య గోడలను తొలగించారు * భోజనం చేయడానికి అవసరమైన డైనింగ్ హాల్ నిర్మాణం చేపడతారు * ముఖ్యమంత్రి ఏకాంతంగా మాట్లాడేందుకు వీలుగా ప్రత్యేక హాల్‌ను తీర్చిదిద్దుతున్నారు * సందర్శకుల కోసం ప్రత్యేక హాల్ నిర్మాణం చేపడతారు * అధికారులతో సమీక్షల కోసం కాన్ఫరెన్స్ హాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను నిర్మిస్తారు * మంత్రివర్గ సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తారు * 8వ అంతస్తులోనే సీఎం కార్యాలయ అధికారుల కోసం కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు * 8వ అంతస్తుకు నేరుగా వెళ్లడానికి ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు * 8 వ అంతస్తు చుట్టూ బులెట్ ప్రూఫ్ అద్దాల ఏర్పాటు * ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఆ అంతస్తులోని అన్నింటికీ కొత్తగా అధునాతన ఫర్నిచర్ * 7 వ అంతస్తులో సీఎస్ కార్యాలయం ఏర్పాటు * సీఎస్ సమీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు * అక్కడే సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయం ఏర్పాటు * వీరికి కూడా కొత్త ఫర్నిచర్ -
మేయర్ చాంబర్ సొగసు చూడతరమా....
హైదరాబాద్ : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉన్నత స్థానాల్లోని వారు తలచుకుంటే సౌకర్యాలకు కొరతా... అన్నట్టుంది జీహెచ్ఎంసీలో పరిస్థితి. ఓ వైపు గ్రేటర్ ప్రజలు తాగే నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నా పట్టించుకోని పెద్దలు తమ కార్యాలయను మాత్రం ఆగమేఘాలపై సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అందుకోసం భనవం గోడలు కూల్చేసి అద్దాలతో పచ్చని మైదానం కనువిందు చేసేలా తీర్చి దిద్దుకుంటున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ళలోనే తన చాంబర్‌కు మార్పులు చేయించి..సీత్రూ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోగా తాజాగా మేయర్ మాజిద్ తన చాంబర్‌కు సొబగులు దిద్దాలని ఆదేశించారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం లక్షల రూపాయిలు వెచ్చిస్తున్నారు. ఇక కమిషనర్ రూ.5కే భోజనం పథకాన్ని ప్రారంభించగా..దానికి లభించిన ఆదరణతో మేయర్ రూపాయికే టిఫిన్ కార్యక్రమం ప్రారంభించాలంటున్నారు. కమిషనర్ చాంబర్‌ను అందంగా తీర్చిదిద్దుకోగా లేనిది... తన చాంబర్ నెందుకు అద్దంలా తీర్చిదిద్దరాదనుకున్నారో ఏమో! తన పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 3తో ముగిసిపోతున్న తరుణంలో మేయర్ ఈ పనికి సిద్ధం కావటం జీహెచ్ఎంసీలో చర్చనీయాంశమైంది. -
నేడు రాజమండ్రి చాంబర్ ఎన్నికలు
రాజమండ్రి రూరల్, న్యూస్‌లైన్: రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ లిమిటెడ్ నూతన పాలక మండలి ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకుని ఇతర పార్టీలతో కలసి ప్యానళ్లను తయారు చేసి బరిలో ఉంచారు. తొలుత రౌతు వర్గీయుడైన నందెపు శ్రీనివాస్‌ను మరో ఏడాది కొనసాగించాలని నిర్ణయించారు. ప్రత్యర్థి వర్గం అడ్డుకోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. నందెపును కొనసాగించే విషయంలో రౌతు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్నికలు జరి పించడంలో శివరామసుబ్రహ్మణ్యం సఫలమయ్యారు. శ్రీఘాకోళ్లపు, కొంత మంది చాంబర్ మాజీ అధ్యక్షుల మద్దతుతో మద్దుల మురళీ కృష్ణ, చవ్వాకుల రంగనాథ్ అధ్యక్ష, గౌరవ కార్యదర్శులుగా ప్యానల్ నిలిచారు. ఎమ్మెల్యే రౌతు, మరి కొంత మంది మాజీ చాంబర్ అధ్యక్షుల మద్దతుతో అశోక్‌కుమార్ జైన్, బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు ప్యానల్‌గా పోటీలో ఉన్నారు. ఈ రెండు ప్యానల్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అధ్యక్ష బరిలో నిలిచిన నల్లమిల్లి శ్రీ రామారెడ్డి పోటీ నుంచి తప్పుకుని మద్దుల మురళీకృష్ణ ప్యానల్‌కు మద్దతు తెలిపారు. మరో అధ్యక్ష అభ్యర్థి కేవైఎన్ బాబు మాత్రం బరిలో నిలిచారు. అధ్యక్ష స్థానానికి ఈయన చీల్చే ఓట్లపైనే ఫలితం ఆధారపడి ఉంటుందని వర్తకులు పేర్కొంటున్నారు. 2130 మంది వర్తకులు, 39 అసోసియేషన్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నా రు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అధ్యక్ష, గౌరవ కార్యదర్శి పదవులతో పాటు, రెండు ఉపాధ్యక్ష పదవులు, ఒక కోశాధికారి, ఒక గౌరవ సంయుక్త కార్యదర్శి, మూడు ట్రస్టు బోర్డు డెరైక్టర్ పదవులకు,15 డెరైక్టర్ పదవులకు ఎన్నికలు జరుగనున్నా యి. ఎమ్మెల్యే రౌతు, శివరామ సుబ్రహ్మణ్యం వర్తకుల్లో పట్టు సాధించేందుకు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికలపై వర్తక వర్గంలో ఆసక్తి నెలకొంది.