38 బిలియన్ డాలర్లకి ఈ-కామర్స్!: అసోచామ్ | E-com industry to cross $38 bn mark in India | Sakshi
Sakshi News home page

38 బిలియన్ డాలర్లకి ఈ-కామర్స్!: అసోచామ్

Published Sat, Jan 2 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

38 బిలియన్ డాలర్లకి ఈ-కామర్స్!: అసోచామ్

38 బిలియన్ డాలర్లకి ఈ-కామర్స్!: అసోచామ్

 న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ మార్కెట్ ఈ కొత్త ఏడాదిలో 38 బిలియన్ డాలర్లకి చేరవచ్చని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ పేర్కొంది. 2015లో దేశీ ఈ-కామర్స్ మార్కెట్ 23 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల, ఆన్‌లైన్ పేమెంట్ వ్యవస్థ మెరుగుదల వంటి అంశాలు ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయని వివరించింది. భారీ డిస్కౌంట్ ఆఫర్ల వల్ల గతేడాదిలో ఆన్‌లైన్ కొనుగోళ్లలో బలమైన వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది.

ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో ముంబై అగ్రస్థానంలో ఉందని, దీని తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా ఉన్నాయని తెలిపింది. టైర్-1, టైర్-2 పట్టణాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మొబైల్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. గతేడాది 78 శాతం షాపింగ్ సంబంధిత వివరాల సేకరణ మొైబె ళ్ల నుంచే జరిగిందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు.
 
  2014తో పోలిస్తే గతేడాది దుస్తుల విభాగంలో అధిక వృద్ధి (70 శాతం) నమోదయ్యింద ని, దీని తర్వాతి స్థానాల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు (62 శాతం), బేబీ కేర్ ప్రాడక్ట్స్ (53 శాతం), బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులు (52 శాతం), హోమ్ ఫర్నిచర్ (49 శాతం) ఉన్నాయని పేర్కొన్నారు. అసోచామ్ నివేదిక ప్రకారం.. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారిలో 45 శాతం మంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌కు ప్రాధాన్యమిస్తుంటే, క్రెడిట్ కార్డు పేమెంట్స్ మంచిదని 16 శాతం మంది, డెబిట్ కార్డు ఉత్తమమని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు.
 
  కేవలం 10 శాతం మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను, 7 శాతం మంది మొబైల్ వాలెట్, క్యాష్ కార్డులను ఎంచుకున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారిలో 18-25 ఏళ్ల మధ్యలో ఉన్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారిలో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. గతేడాది ఎక్కువగా అమ్ముడుపోయిన వస్తువుల్లో మొబైల్స్, ఐపాడ్ ఉత్పత్తులు, ఎంపీ3 ప్లేయర్స్, డిజిటల్ కెమెరా, జ్యువెల్లరీ వంటి ఉత్పత్తులు ఉన్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement