Smartphons
-
యాపిల్ బాటలో షియోమీ
చైనా: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ రేపు(డిసెంబర్ 28) ఫ్లాగ్షిప్ ఫోన్ ఎంఐ 11ను విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా షియోమీ సీఈఓ లీ జూన్ ఫ్లాగ్షిప్ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ లోపల ఛార్జర్‌ను తీసుకురావడం లేదని అధికారికంగా ధ్రువీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు లీ జూన్ పేర్కొన్నారు. ఇంట్లో పాత ఛార్జర్ లేని వినియోగదారులు కొత్త ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి అని అన్నారు. గతంలో ఇదే విదంగా యాపిల్ పర్యావరణ హితం అనే కారణంతో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను ఇయర్ఫోన్లు, ఛార్జర్ లేకుండా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అదేవిదంగా శామ్సంగ్ నుండి త్వరలో రాబోయే గెలాక్సీ ఎస్ 21 సిరీస్ స్మార్ట్ఫోన్లతో కూడా ఛార్జర్‌ను తీసుకురావడం లేదని సమాచారం.(చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో మరో షాపింగ్ ఫెస్టివల్) రాబోయే ఎంఐ 11 ఫ్లాగ్షిప్ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ లోపల ఛార్జర్‌ను తీసుకురావడం లేదని చైనా సోషల్ మెసేజింగ్ యాప్ వీబోలో అధికారికంగా ధ్రువీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు లీ జూన్ చెప్పారు. అదేవిదంగా ఎగ్జిక్యూటివ్ రిటైల్ బాక్స్ యొక్క ఫోటోను షేర్ చేసారు. ఈ ఫొటోలో '11' నెంబర్ తో మినిమాలిస్టిక్ డిజైన్ లో బాక్స్ సైజ్ సన్నగా ఉంది. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం ఎంఐ 11 ఫ్లాగ్షిప్ ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను తీసుకురానున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12పై పనిచేయనుంది. అలాగే, ఫ్లాగ్‌షిప్‌లో QHD ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 120హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. షియోమీ ఎంఐ 11 ఫ్లాగ్షిప్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది. షియోమీ ఎంఐ 11 బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ధర. సీఎన్‌వై 4,500 (సుమారు రూ.50,700) లభించనుంది. దీని 8జీబీ ర్యామ్ + 256 జీబీ మోడల్ సీఎన్‌వై 4,800(సుమారు రూ.54,000), టాప్-ఎండ్ మోడల్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర సీఎన్‌వై 5,200 (సుమారు రూ.58,600)గా ఉండనుందని తెలుస్తోంది. -
చైనా స్మార్ట్‌ఫోన్స్ హవా
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో చైనా కంపెనీల ధాటికి ఎదురు నిలవలేక దేశీ సంస్థలు కుదేలవుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం దాకా ఆధిపత్యం కొనసాగించిన మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా, ఇంటెక్స్ వంటి దేశీ బ్రాండ్స్ అమ్మకాలు ప్రస్తుతం గణనీయంగా క్షీణించాయి. 2015లో స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో దేశీ సంస్థల వాటా 43 శాతంగా ఉండగా.. 2018 నాటికి సింగిల్ డిజిట్ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి 10 స్మార్ట్‌ఫోన్స్‌లో 6 చైనా బ్రాండ్స్‌వే ఉంటున్నాయంటే పరిస్థితి అర్థమవుతుంది. చైనా కంపెనీల స్మార్ట్ వ్యూహాలు... చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు స్మార్ట్ వ్యూహాలనే అనుసరించాయి. వ్యయాలు నియంత్రణలో ఉండేలా ముందుగా చౌకైన ఆన్లైన్ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఫ్లాష్ సేల్స్ పేరిట తక్కువ రేటుకే బోలెడన్ని లేటెస్ట్ ఫీచర్స్ అంటూ ఊదరగొట్టి ముందుగా కస్టమర్స్‌కు చేరువయ్యాయి. ఇప్పుడు నిలదొక్కుకున్న తర్వాత ఆఫ్‌లైన్ స్టోర్స్‌నూ ఏర్పాటు చేస్తున్నాయి. షావోమీ, వివో, ఒప్పో, వన్ ప్లస్ వంటి చైనా సంస్థలు అందుబాటు ధరల్లో లేటెస్ట్ ఫీచర్స్‌తో కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ దూకుడుగా దూసుకెళ్లిపోతున్నాయి. కొన్ని మోడల్స్‌ను భారత్‌లోనే అసెంబ్లింగ్ చేసి మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ అంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కొరియన్ దిగ్గజం శాంసంగ్‌ను కూడా అగ్రస్థానం నుంచి పడగొట్టాయి. మన బ్రాండ్స్ పతనానికి కారణాలేంటంటే.. ముందు నుంచీ చైనా బ్రాండ్స్ దూకుడుగా దూసుకెడుతుంటే.. మన సంస్థలు నింపాదిగా వ్యవహరించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నది పరిశ్రమ పరిశీలకులు విశ్లేషణ. 3జీ నుంచి 4జీ టెక్నాలజీకి మళ్లే క్రమంలో ఓవైపు మైక్రోమ్యాక్స్ వంటి భారతీయ బ్రాండ్స్ కాలం చెల్లిన 3జీ ఫోన్స్ నిల్వలను వదిలించుకునే ప్రయత్నాల్లో ఉంటే .. మరోవైపు చైనా కంపెనీలు చాలా వేగంగా కొంగొత్త 4జీ మోడల్స్‌ను ప్రవేశపెడుతూ మార్కెట్‌ను ఆక్రమించేశాయని వారు చెప్పారు. కొనుగోలుదారుల నాడిని పట్టుకోవడంలో కూడా భారతీయ బ్రాండ్స్ విఫలం కావడం మరో కారణం. చైనా కంపెనీలు 4జీ, డ్యూయల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, గ్లాస్ బ్యాక్ లాంటి కొత్త ఫీచర్స్‌తో ఫోన్స్ తెస్తుండగా.. అలాంటి వాటినే ప్రవేశపెట్టడంలో భారతీయ కంపెనీలు బాగా వెనకబడిపోయాయి. ఇక ఆన్లైన్, ఫ్లాష్ సేల్స్‌తో చైనా కంపెనీలు తక్కువ ఖర్చులో ఎక్కువ మంది కొనుగోలుదారులకు వేగంగా చేరువయ్యాయి. ఆ తర్వాత కాస్త ఖరీదైన వ్యవహారమే ఆయినప్పటికీ.. క్రికెట్ మ్యాచ్‌ల స్పాన్సర్షిప్ వంటి వాటితో మార్కెటింగ్, అడ్వరై్టజింగ్ విషయాల్లో ముందుకెళ్లాయి. అదే సమయంలో దేశీ కంపెనీలు వాస్తవ పరిస్థితులను పూర్తిగా అంచనా వేయలేక, వెనుకబడిపోయాయని టెలికం పరిశ్రమ నిపుణుడు, ఫిన్ఎక్స్ప్రోస్ కన్సల్టింగ్ సంస్థ సీఈవో మోహన్ శుక్లా విశ్లేషించారు. చైనా బ్రాండ్లు దేశీ బ్రాండ్స్‌ను పూర్తిగా తుడిచిపెట్టేశాయి అని వ్యాఖ్యానించారు జెన్ బ్రాండ్ పేరిట ఫోన్స్ తయారు చేసే ఆప్టిమస్ సంస్థ చీఫ్ అశోక్ గుప్తా. చైనా సంస్థలతో మన కంపెనీలు ఎక్కడా పోటీపడే పరిస్థితే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సంస్థ బ్లాక్‌బెర్రీ ఫోన్స్‌తో పాటు ఇతరత్రా బ్రాండ్స్ కోసం కాంట్రాక్టు విధానంలో ఫోన్స్ తయారు చేసి ఇస్తోంది. చైనా బ్రాండ్స్‌తో పోరాడటమంటే.. ఏకం గా ఆ దేశంతో యుద్ధానికి దిగినట్లేనని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహింద్రూ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి మారాలంటే దేశీయంగా చాంపియన్ బ్రాండ్స్ పుట్టుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశీ సంస్థలకు ప్రత్యేక తోడ్పాటునివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఆశాకిరణంగా జియో... చైనా కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో పూర్తి ఆధిపత్యం సాధించినప్పటికీ, ఫీచర్ ఫోన్స్ విషయంలో మాత్రం దేశీ బ్రాండ్స్.. ముఖ్యంగా రిలయన్స్ జియో ముందు స్థానంలో ఉంది. మొబైల్ ఫోన్ సర్వీసులను ఫోన్‌తో కూడా కలిపి ఇస్తుండటంతో రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్స్ అమ్మకాలు బాగానే ఉన్నాయి. ఈ విభాగంలో జియోకి ప్రస్తుతం 40 శాతం మార్కెట్ వాటా ఉంది. 12 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. -
రూ.10,000లోపు బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ షావోమిదే...
న్యూఢిల్లీ: దేశంలో రూ.10,000లోపు బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్స్‌లో షావోమి అగ్రస్థానం దక్కించుకుంది. 2017 రెండో త్రైమాసికానికి సంబంధించి రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. షావోమికి చెందిన ‘రెడ్మి నోట్–4’, ‘రెడ్మి–4’ స్మార్ట్ఫోన్లు వరుసగా 7.2 శాతం, 4.5 శాతం మార్కెట్ వాటాతో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఇక 4.3 శాతం వాటాతో శాంసంగ్ ‘గెలాక్సీ జే2’ మూడో స్థానంలో ఉంది. ఒప్పొ ఏ37, శాంసంగ్ గెలాక్సీ జే7 వరుసగా 3.5 శాతం, 3.3 శాతం వాటాలతో నాలుగు, ఐదో స్థానంలో ఉన్నాయి. 2017 తొలి అర్ధభాగంలో రూ.10,000లోపు విభాగంలో ‘రెడ్మి నోట్–4’ టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. -
జర జాగ్రత్త!
స్మార్ట్‌ఫోన్స్ కొంత మేలు చేస్తూనే ఉన్నా... చాలా సందర్భాల్లో పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయనీ, వాటిని పరిమితంగా వాడాలనీ, పిల్లల విషయంలో మరింత జాగ్రత్త పాటించాలని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే గాక... డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఆధునిక ఉపకరణాలన్నింటి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. డ్యూక్ యూనివర్సిటీకి చెందిన స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన మానసిక నిపుణులు ఇటీవల స్మార్ట్ ఫోన్లు, ఇతర ఆధునిక ఉపకరణాలతో పిల్లలపై పడుతున్న ప్రభావంపై తాజాగా ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో కొన్ని సానుకూలమైన అంశాలున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఆధునిక ఉపకరణాలు వాడే పిల్లల్లో అధికంగా యాంగై్జటీకి గురికావడం తక్కువ. కానీ కొన్ని అంశాలు మాత్రం ఆందోళనగొల్పేవిగా ఉన్నాయంటున్నారు అధ్యయనవేత్తలు. ‘‘సాంకేతికతను వాడుకోవడం తప్పు కాదు. అయితే దాన్ని అతిగా వాడటం వల్ల పిల్లల్లో మానసికమైన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో చాలా ముఖ్యమైనవి ప్రవర్తనకు సంబంధించినవి’’ అంటూ హెచ్చరిస్తున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న మానసిక నిపుణులు. -
చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్స్‌కు పెరుగుతున్న ఆదరణ
న్యూఢిల్లీ: దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో (టైర్-2,3) స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు పెరిగాయి. అదే సమయంలో టైర్-1 పట్టణాల్లో అమ్మకాలు తగ్గాయని ఐడీసీ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి టైర్-1 పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్స్ విక్రయాల వాటా 26.4%గా నమోదయ్యింది. ఈ వాటా అంతకు ముందటి త్రైమాసికంలో 29.9 %గా ఉంది. -
ఎప్పుడైనా.. ఎక్కడైనా.. క్షణాల్లో నగదు బదిలీ...
నడుస్తున్నది స్మార్ట్ఫోన్ల యుగం. ఇవి మన జీవితంలో అంతర్భాగమయ్యాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్లను దృష్టిలో ఉంచుకొనే కొత్త కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ జరుగుతోంది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్స్ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పుకు నాందిపలుకుతున్నాయి. బ్యాంక్ ఖాతా, ఐఎఫ్ఎస్సీ, కార్డు నంబరు, పేరు వంటి వివరాల అవసరం లేకుండానే కేవలం క్షణాల్లో మొబైల్ నుంచి డబ్బుల్ని ఇతరులకు పంపే సౌలభ్యం అందుబాటులోకి వస్తోంది. అదే యూపీఐ విధానం. దీంతో పేమెంట్స్ వ్యవస్థలో కొత్త శకం ప్రారంభంకానున్నది. యూపీఐ ద్వారా ఎవరికైనా, ఎప్పుడైనా క్షణాల్లో డబ్బుల్ని పంపొచ్చు. అదెలాగో చూద్దాం.. * యూపీఐ విధానాన్ని ఆవిష్కరించిన ఎన్పీసీఐ * ఇక సరళంగా, భద్రంగా చెల్లింపులు * 1-2 నెలల్లో అందుబాటులోకి సేవలు * వాలెట్లకు పోటీ తప్పదు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఒక ఇన్స్టంట్ ఆన్లైన్ బ్యాంక్ పేమెంట్స్ విధానం. ఇది ఒక మొబైల్ ఇంటర్ఫేజ్ (యాప్). మొబైల్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. యూపీఐ ఒక రకంగా చూస్తే ఐఎంపీఎస్‌కు అడ్వాన్స్డ్ వెర్షన్ లాంటిది. యూపీఐ ద్వారా స్కూల్ ఫీజులు, కిరాణ సరుకులు, ఆన్లైన్ షాపింగ్ బిల్లులను కేవలం క్షణాల్లో చెల్లించొచ్చు. డబ్బుల్ని భద్రంగా తక్షణమే ఇతరులకు (వ్యక్తి-వ్యక్తి, వ్యక్తి-సంస్థ/వ్యాపారులు, సంస్థ/వ్యాపారులు-వ్యక్తి) పంపొచ్చు. అలాగే తీసుకోవచ్చు. 24 గంటలూ అందుబాటులో ఉండే సర్వీసు. యూపీఐ విధానంలో రెండంచెల అథంటికేషన్ వ్యవస్థ ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఏ లావాదేవికైనా రెండంచెల అథంటికేషన్ తప్పనిసరి. యూపీఐ ఎలా పనిచేస్తుందంటే? బ్యాంకులు ఈ సర్వీసులను అందించాలంటే అవి ముందుగా యూపీఐ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం కావాలి. ప్రస్తుతానికి 29 బ్యాంకులు ఎన్పీసీఐతో భాగస్వామ్యమై ఉన్నాయి. ఈ బ్యాంకులు సర్వీసుల ప్రారంభానికి అనువుగా వాటి వాటి యాప్‌లను యూపీఐ ఫ్రేమ్‌వర్క్ కోసం అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంది. సదరు బ్యాంకు యూపీఐ సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన తర్వాత.. ఆ బ్యాంక్ మీకు ఒక వర్చ్యువల్ ఐడీని, మొబైల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (ఎంపిన్)ని కేటాయిస్తుంది. మీ పేరు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్లలో ఏదైనా వర్చ్యువల్ ఐడీగా ఉండొచ్చు. ఉదాహరణకు మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయితే.. మీ ఐడీ రవిఎట్యాక్సిస్బ్యాంక్.కామ్‌గా ఉండొచ్చు. సంప్రదాయ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు యూపీఐకి తేడా ఏంటి? దేశంలో ఉన్న ప్రధానమైన ఈ-పేమెంట్స్ విధానాలు.. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), ఇమ్మిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్). వీటి ద్వారా డబ్బుల్ని పంపాలంటే బ్యాంక్ ఖాతా, ఓటీపీ, ఐఎఫ్ఎస్సీ వంటి తదితర నంబర్లు కావాలి. డబ్బు పంపించాలనుకుంటున్న వారి ఖాతాలను ముందుగా జత చేసుకోవాలి. ఇంత చేసినా డబ్బు వెంటనే పంపగలమా? అంటే లేదు. సమయం పడుతుంది. ఇక వాలెట్లు అంటారా.. వాటిని క్రెడిట్, డెబిట్ కార్డులతో నింపుకుంటేనే పనిచేస్తాయి. యూపీఐలో ఇలాంటివేమీ ఉండవు. వర్చ్యువల్ ఐడీ ఇచ్చామా.. ఎంపిన్ ఎంటర్ చేశామా.. అంతే లావాదేవీ క్షణాల్లో జరిగిపోతుంది. దీని ద్వారా నెలవారి బిల్లులను ఆటోమేటిక్‌గా క్రమం తప్పకుండా చెల్లించవచ్చు. యూపీఐ ఆవిష్కరణ ఉద్దేశమేమిటి? యూపీఐ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం దేశంలో క్యాష్ ఎకానమీని తగ్గించడం. అంటే ప్రజలు ప్రత్యక్ష నగదుపై ఆధారపడటాన్ని నిలువరించడం. ఈ లక్ష్యంతోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ విధానానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గత నెలలో ఈ విధానాన్ని ఆవిష్కరించింది. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దాదాపు 18 శాతంమేర నగదు ప్రత్యక్షంగా (చేతి ద్వారా) వ్యవస్థలో చెలామణిలో ఉందని ఆర్బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే ప్రపంచంలో ఎక్కువగా ప్రత్యక్ష నగదుపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలో మనదీ ఒకటి. యూపీఐ విధానం వల్ల లావాదేవీలకు పట్టే సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని ఆర్బీఐ పేర్కొంటోంది. యూపీఐ వ్యవస్థ స్థిరీకరణకు 1-2 ఏళ్లు పట్టొచ్చని ఎన్పీసీఐ అభిప్రాయపడింది. బ్యాంకులు ఈ సేవలను కస్టమర్లకు అందించడానికి 1-2 నెలలు సమయం పట్టొచ్చు. చెల్లింపుల నిర్వహణ ఇలా... మీరు ఒక మాల్‌కు వెళితే అక్కడ మీ బిల్లు రూ.2,000 అయ్యింది. అప్పుడు మీరు క్యాష్ కౌంటర్లో కేవలం మీ వర్చ్యువల్ ఐడీ చెబితే చాలు. అతను ఐడీ ఎంటర్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఒకే చేస్తే.. అంటే ఎంపిన్‌ను ఎంటర్ చేయగానే లావాదేవీ జరిగిపోయి.. మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అదే మీరు ఈ-కామర్స్ వెబ్సైట్లో ఒక వస్తువును కొంటున్నారనుకోండి. వస్తు ఎంపిక తర్వాత దాని బిల్లును చెల్లించడానికి ప్రస్తుతం సైట్లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. త్వరలో వీటితోపాటు యూపీఐ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అప్పుడు మీరు పేమెంట్ కోసం యూపీఐని ఎంచుకోవాలి. తర్వాత దానిలో మీ వర్చ్యువల్ ఐడీని ఎంటర్ చేయాలి. అప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ స్క్రీన్ మీద ఒక పాప్అప్ వస్తుంది. దానిలో మీ ఎంపిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. బిల్లు చెల్లింపు జరిగిపోతుంది. అలాగే మీరు మీ స్నేహితునికి డబ్బులు పంపించాలనుకుంటున్నారు. యూపీఐ ద్వారా అతనికి డబ్బుల్ని వెంటనే పంపొచ్చు. కానీ ఇక్కడ అతనికి కూడా వర్చ్యువల్ ఐడీ ఉండాలి. అంటే ఆయన బ్యాంకు కూడా యూపీఐ ప్లాట్ఫామ్లో భాగస్వామి అయ్యి ఉండాలి. ఇక్కడ యూపీఐకి మరొక ప్రత్యేకత ఉంది. ఎన్ని బ్యాంకు అకౌంట్లున్నా కేవలం ఒకే ఒక యూపీఐ యాప్ ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇక్కడ వర్చ్యువల్ ఐడీ మారుతుంది అంతే. ఉదాహరణకు రవికి రెండు బ్యాంకుల్లో ఖాతాలుంటే.. ప్రస్తుతం అతను ఆ రెండు బ్యాంకుల యాప్‌లను ఉపయోగిస్తూ ఉంటాడు. యూపీఐలో ఆ అవసరం లేదు. అన్ని బ్యాంకులు ఎన్పీసీఐతో భాగస్వామ్యమై ఉండటంతో ఒకే యాప్ ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు. అయితే వర్చ్యువల్ ఐడీలు అతనికి రెండు ఉంటాయి. బ్యాంక్ ఖాతా, కార్డు నంబర్ లాంటి ఎలాంటి వివరాలను తెలియజేయడం లేదు కాబట్టి సమాచార భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాలెట్ల పనైపోయినట్లేనా? దేశంలో మొబైల్ వాలెట్లకు ఆదరణ బాగుంది. వీటి ద్వారా జరిగే లావాదేవీలు అధికంగానే ఉన్నాయి. చాలా ప్రైవేట్ సంస్థలు వాలెట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అంతెందుకు బ్యాంకులు కూడా ప్రత్యేకంగా వాలెట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఫోన్ రీచార్జ్, టికెట్స్ బుకింగ్ వంటి తదితర అంశాలు వాలెట్ల ద్వారా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇక మీదటే.. వీటికి యూపీఐ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. వాలెట్లలో డబ్బుల్ని నింపుకోవాలంటే.. అది డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారానే జరగాలి. అలాగే ఒక సంస్థ వాలెట్ నుంచి మరొక సంస్థ వాలెట్‌కు డబ్బుల్ని పంపుకోలేం. యూపీఐ ద్వారా డెరైక్ట్‌గా డబ్బుల్ని ఇతరులకు, విక్రయదారులకు చెల్లించే వెసులుబాటు ఉన్నప్పుడు ప్రత్యేకంగా వాలెట్లలో డబ్బుల్ని నింపుకోవడం ఎందుకు? అప్పుడు వాలెట్లతో పనేముంటుంది. వాలెట్లలో రూ.10,000 మించి లావాదేవీలకు కేవైసీ వివరాలు తప్పనిసరి. యూపీఐలో రూ.1,00,000 వరకు నగదును ఇతరులకు పంపొచ్చు. అలాగే యూపీఐలో లావాదేవి విలువ రూ.0.45 కన్నా తక్కువగానే ఉంటుంది. యూపీఐ విస్తరణ, వినియోగం పెరుగుతున్న కొద్ది ఎస్బీఐ బుడ్డి, ఐసీఐసీఐ పాకే ట్స్సహా పేటీఎం వాలెట్లకు ఆదరణ తగ్గొచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. -
భారత్‌లోకి గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్
విడుదల చేసిన శాంసంగ్ ధరలు రూ.48,900; రూ.56,900 న్యూఢిల్లీ: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్స్‌ను మంగళవారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు 32 జీబీ, 64 జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఇవి వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను శాంసంగ్ వెబ్సైట్లోకి వెళ్లి ప్రి-బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 8-18 మధ్యకాలంలో ప్రి-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ వర్చువల్ రియాలిటీ(వీఆర్)ను ఉచితం గా అందిస్తోంది. కాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఓపెన్ మార్కెట్లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. గెలాక్సీ ఎస్7: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.1 అంగుళాల తెర, ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్, 32 జీబీ మెమరీ, 4జీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.48,900గా ఉంది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్: 5.5 అంగుళాల తెర, ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 4జీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్, 32 జీబీ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.56,900. -
38 బిలియన్ డాలర్లకి ఈ-కామర్స్!: అసోచామ్
న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ మార్కెట్ ఈ కొత్త ఏడాదిలో 38 బిలియన్ డాలర్లకి చేరవచ్చని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ పేర్కొంది. 2015లో దేశీ ఈ-కామర్స్ మార్కెట్ 23 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల, ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ మెరుగుదల వంటి అంశాలు ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయని వివరించింది. భారీ డిస్కౌంట్ ఆఫర్ల వల్ల గతేడాదిలో ఆన్లైన్ కొనుగోళ్లలో బలమైన వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్ విషయంలో ముంబై అగ్రస్థానంలో ఉందని, దీని తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా ఉన్నాయని తెలిపింది. టైర్-1, టైర్-2 పట్టణాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మొబైల్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. గతేడాది 78 శాతం షాపింగ్ సంబంధిత వివరాల సేకరణ మొైబె ళ్ల నుంచే జరిగిందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. 2014తో పోలిస్తే గతేడాది దుస్తుల విభాగంలో అధిక వృద్ధి (70 శాతం) నమోదయ్యింద ని, దీని తర్వాతి స్థానాల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు (62 శాతం), బేబీ కేర్ ప్రాడక్ట్స్ (53 శాతం), బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులు (52 శాతం), హోమ్ ఫర్నిచర్ (49 శాతం) ఉన్నాయని పేర్కొన్నారు. అసోచామ్ నివేదిక ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ చేసేవారిలో 45 శాతం మంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌కు ప్రాధాన్యమిస్తుంటే, క్రెడిట్ కార్డు పేమెంట్స్ మంచిదని 16 శాతం మంది, డెబిట్ కార్డు ఉత్తమమని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 10 శాతం మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను, 7 శాతం మంది మొబైల్ వాలెట్, క్యాష్ కార్డులను ఎంచుకున్నారు. ఆన్లైన్ షాపింగ్ చేసేవారిలో 18-25 ఏళ్ల మధ్యలో ఉన్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆన్లైన్ షాపింగ్ చేసేవారిలో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. గతేడాది ఎక్కువగా అమ్ముడుపోయిన వస్తువుల్లో మొబైల్స్, ఐపాడ్ ఉత్పత్తులు, ఎంపీ3 ప్లేయర్స్, డిజిటల్ కెమెరా, జ్యువెల్లరీ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. -
మీరెక్కడున్నారో చెప్పే గ్లిమ్ప్స్..
ఆఫీసు నుంచి ఇంటికెళ్లడం కొంచెం ఆలస్యమైనా సరే.. వెంటవెంటనే ఆప్తుల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయా? ఎక్కడున్నావు? ఎంతసేపు పడుతుంది? అన్న ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేస్తున్నారా? ఇకపై వారి స్మార్ట్‌ఫోన్స్‌లో గ్లిమ్ప్స్ అప్లికేషన్ ఉండేలా చూసుకోండి. అంతా సరిపోతుంది. ఎలాగంటారా? ఏ నిమిషానికి మీరు ఎక్కడున్నదీ దీనిద్వారా ఇతరులకు తెలియజేయవచ్చు మరి. ఆఫీసు నుంచి బయలుదేరిన వెంటనే ఒకసారి ఆన్ చేస్తే చాలు. మీరు ముందుగా ఫీడ్ చేసిన నెంబర్లకు మీరున్న ప్రాంతపు సమాచారం తెలిసిపోతుంది.