చైనా: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ రేపు(డిసెంబర్ 28) ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎంఐ 11ను విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా షియోమీ సీఈఓ లీ జూన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ లోపల ఛార్జర్‌ను తీసుకురావడం లేదని అధికారికంగా ధ్రువీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు లీ జూన్ పేర్కొన్నారు. ఇంట్లో పాత ఛార్జర్ లేని వినియోగదారులు కొత్త ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి అని అన్నారు. గతంలో ఇదే విదంగా యాపిల్ పర్యావరణ హితం అనే కారణంతో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్‌లను ఇయర్‌ఫోన్లు, ఛార్జర్ లేకుండా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అదేవిదంగా శామ్‌సంగ్ నుండి త్వరలో రాబోయే గెలాక్సీ ఎస్ 21 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో కూడా ఛార్జర్‌ను తీసుకురావడం లేదని సమాచారం.(చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో మరో షాపింగ్ ఫెస్టివల్)
రాబోయే ఎంఐ 11 ఫ్లాగ్‌షిప్ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ లోపల ఛార్జర్‌ను తీసుకురావడం లేదని చైనా సోషల్ మెసేజింగ్ యాప్ వీబోలో అధికారికంగా ధ్రువీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు లీ జూన్ చెప్పారు. అదేవిదంగా ఎగ్జిక్యూటివ్ రిటైల్ బాక్స్ యొక్క ఫోటోను షేర్ చేసారు. ఈ ఫొటోలో '11' నెంబర్ తో మినిమాలిస్టిక్ డిజైన్ లో బాక్స్ సైజ్ సన్నగా ఉంది. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం ఎంఐ 11 ఫ్లాగ్‌షిప్ ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను తీసుకురానున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12పై పనిచేయనుంది. అలాగే, ఫ్లాగ్‌షిప్‌లో QHD ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 120హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
షియోమీ ఎంఐ 11 ఫ్లాగ్‌షిప్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది. షియోమీ ఎంఐ 11 బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ధర. సీఎన్‌వై 4,500 (సుమారు రూ.50,700) లభించనుంది. దీని 8జీబీ ర్యామ్ + 256 జీబీ మోడల్ సీఎన్‌వై 4,800(సుమారు రూ.54,000), టాప్-ఎండ్ మోడల్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర సీఎన్‌వై 5,200 (సుమారు రూ.58,600)గా ఉండనుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment