ఇండియాలో హయ్యస్ట్ అమ్మకాలు సాధించిన ఎంఐ బ్రాడ్ పేరు మారబోతుంది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు నాణ్యతతో అందిస్తూ ఇండియా మార్కె్‌ట్‌లో చెరగని ముద్ర వేసింది ఎంఐ బ్రాండ్. స్మార్ట్‌ఫోన్లతో మొదలు పెట్టి టీవీలు, వాచీలు, ఇయర్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ ఇలా అనేక విభాగాలకు విస్తరించిన ఎంఐ బ్రాండ్, దాని లోగో ప్రస్తుతం ఉన్న రూపంలో భవిష్యత్తులో కనిపించదు.
Mi ఎలా వచ్చింది.
ఎంఐ బ్రాండ్‌తో మనకు లభించే ఫోన్లు, ల్యాప్‌ల్యాప్‌లను తయారు చేసే కంపెనీ పేరు షావోమి. ఇంగ్లిష్‌లో Xiaomiగా రాస్తారు. ఇందులో చివరి రెండు అక్షరాలైన Mi అక్షరాలనే లోగోగా మార్చి షావోమి చైనా, ఇండియాతో పాటు ఏషియా మార్కెట్‌లో తిరుగులేని బ్రాండ్‌గా మారింది.
ఎంఐ బ్రాండ్ ఎప్పటి నుంచి
షావోమి నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ 2011 ఆగస్టులో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్న మోడల్స్ వచ్చాయి. ఇందులో ఎంఐ నోట్ సిరీస్‌కి ఇండియాలో మంచి ఆధరణ లభించింది. తాజాగా షావోమి సంస్త చైనాలో మిక్స్ 4 పేరుతో కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ సందర్భంగా ఫోన్‌పై ఎంఐకి బదులు షావోమి అని ముద్రించింది. అంతేకాదు ఫోన్ ఆన్ చేసినప్పుడు వచ్చే ఎంఐ లోగో బదులు షావోమి లోగోను పొందు పరిచింది.
మిగిలిన చోట ఎప్పుడు
ప్రస్తుతం చైనాలో ఎంఐ బ్రాండ్ స్థానంలో షావోమి బ్రాండ్ నేమ్, లోగోను ఉపయోగిస్తున్నామని, త్వరలోనే ఇతర మార్కెట్ రీజియన్లలో కూడా ఎంఐ బదులు షావోమి లోగో, బ్రాండ్ నేమ్‌ను ప్రవేశపెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో రిలీజ్ అయ్యే ప్రొడక్టులపై ఎంఐ బదులుగా షావోమి అని ఉంటుందని వెల్లడించారు.
అమ్ముడైన ఫోన్లు ఎన్ని
2011లో షావోమి సంస్థ నుంచి తొలి ఫోన్ ఎంఐ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల ఫోన్ల అమ్మకాలు జరిగాయి. టెక్ దిగ్గజ కంపెనీలైన శామ్‌సంగ్, ఆపిల్‌లను సైతం ఎంఐ వెనక్కి నెట్టింది.తాజాగా ఈ కంపెనీ బ్రాండ్ నేమ్‌ని ఎంఐ నుంచి షావోమికి మారుతోంది.
చదవండి: Work From Home: ఐటీ కంపెనీలకు కర్నాటక సర్కార్ రిక్వెస్ట్
Comments
Please login to add a commentAdd a comment