భారత్లోకి గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్
విడుదల చేసిన శాంసంగ్ ధరలు రూ.48,900; రూ.56,900
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్స్‌ను మంగళవారం భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 32 జీబీ, 64 జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఇవి వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను శాంసంగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రి-బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 8-18 మధ్యకాలంలో ప్రి-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ వర్చువల్ రియాలిటీ(వీఆర్)ను ఉచితం గా అందిస్తోంది. కాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఓపెన్ మార్కెట్‌లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
గెలాక్సీ ఎస్7: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.1 అంగుళాల తెర, ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్, 32 జీబీ మెమరీ, 4జీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.48,900గా ఉంది.
గెలాక్సీ ఎస్7 ఎడ్జ్: 5.5 అంగుళాల తెర, ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 4జీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్, 32 జీబీ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.56,900.