రూ.10,000లోపు బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ షావోమిదే... | Xiaomi best-selling smartphone under Rs 10000 category in India | Sakshi
Sakshi News home page

రూ.10,000లోపు బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ షావోమిదే...

Published Sat, Jul 29 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM

రూ.10,000లోపు బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ షావోమిదే...

రూ.10,000లోపు బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ షావోమిదే...

న్యూఢిల్లీ: దేశంలో రూ.10,000లోపు బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో షావోమి అగ్రస్థానం దక్కించుకుంది. 2017 రెండో త్రైమాసికానికి సంబంధించి రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. షావోమికి చెందిన ‘రెడ్‌మి నోట్‌–4’, ‘రెడ్‌మి–4’ స్మార్ట్‌ఫోన్లు వరుసగా 7.2 శాతం, 4.5 శాతం మార్కెట్‌ వాటాతో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి.

ఇక 4.3 శాతం వాటాతో శాంసంగ్‌ ‘గెలాక్సీ జే2’ మూడో స్థానంలో ఉంది. ఒప్పొ ఏ37, శాంసంగ్‌ గెలాక్సీ జే7 వరుసగా 3.5 శాతం, 3.3 శాతం వాటాలతో నాలుగు, ఐదో స్థానంలో ఉన్నాయి. 2017 తొలి అర్ధభాగంలో రూ.10,000లోపు విభాగంలో ‘రెడ్‌మి నోట్‌–4’ టాప్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement