బీసీ సంక్షేమ శాఖలో నోటి దురుసుతో వివాదాస్పదమై విచారణ ఎదుర్కొంటున్న ఓ అధికారి తాజాగా అదే శాఖ డీడీ చాంబర్‌లో జరిగిన పర్యవేక్షకుల సమావేశంలోనూ అలాగే వ్యవహరించాడు. జిల్లాలోని బీసీ సంక్షేమశాఖ హాస్టళ్లకు నెలవారీ బియ్యం కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, దీంతో విద్యార్థులు, వార్డెన్లు ఇబ్బందుల పాలవుతున్నారని, ఏబీసీ డబ్ల్యూ వో సమావేశంలో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
-
కేటాయింపుల్లో అవకతవకలపై నిలదీసిన ఏబీసీడబ్ల్యూఓ
హన్మకొండ అర్బన్ : బీసీ సంక్షేమ శాఖలో నోటి దురుసుతో వివాదాస్పదమై విచారణ ఎదుర్కొంటున్న ఓ అధికారి తాజాగా అదే శాఖ డీడీ చాంబర్‌లో జరిగిన పర్యవేక్షకుల సమావేశంలోనూ అలాగే వ్యవహరించాడు. జిల్లాలోని బీసీ సంక్షేమశాఖ హాస్టళ్లకు నెలవారీ బియ్యం కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, దీంతో విద్యార్థులు, వార్డెన్లు ఇబ్బందుల పాలవుతున్నారని, ఏబీసీ డబ్ల్యూ వో సమావేశంలో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంపై చర్చ జరుగుతుండగా అక్కడే ఉన్న సదరు అధికారి ఏబీసీ డబ్ల్యూవోపై నోటి దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి దూషించుకున్నట్లు తెలిసింది. తన పై దురుసుగా మాట్లాడిన వారి విషయంలో ఉన్నతాధికారులు ఉదా సీనంగా వ్యవహరించడంపై ఏబీసీడబ్ల్యూవో అర్ధంతరంగా వెళ్లి పోయారు. దీనిపై కొందరు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చేపట్టే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. డీడీ నర్సింహస్వామిని వివరణ కోరగా అనవసరమైన చర్చ వల్ల మీటింగ్ పక్కదారి పట్టిందన్నారు. బియ్యం కేటాయింపుల్లో జరిగిన లోపాలను వచ్చే నెలలో సరిదిద్దుతామన్నా పట్టించుకోకపోవడంతో సమస్య పెద్దదైందని తెలిపారు.