
ఈ ఫలితాలను పట్టించుకోవలసిన అవసరంలేదు:డి.శ్రీనివాస్
హైదరాబాద్: ఈ ఎన్నికల ఫలితాలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. వీటికి, సార్వత్రిక ఎన్నికలకు తేడా ఉంటుందన్నారు. కొత్త పార్టీ మంచి ఫలితాలను సాధించడం కూడా మంచిదేనన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సమన్యాయం లోపించిందని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా యుపిఏ 3 రావడం కాయం అన్నారు. యుపిఏ 2 పడిపోదని, తెలంగాణ ప్రక్రియ ఆగిపోదని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సీమాంధ్ర రాజకీయ నేతలు సహకరించాలన్నారు. విభజన ప్రక్రియ తుది దశకు వచ్చినందున తమ ప్రాంతానికి ఏమి కావాలో కోరుతే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు.