కామారెడ్డి, న్యూస్‌లైన్ : ఒకదాని వెంట ఒకటిగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాల కోసం మరోవా రం రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అభ్యర్థులు, వారి అనుచరుల్లో టెన్షన్ పెరుగుతోంది. మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 06 ,11 తేదీల్లో రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 30న నిర్వహించా రు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌పై కోర్టులు తీర్పు ఇచ్చాయి.
దీంతో ఫలితాలు సార్వత్రిక ఎన్నికల అనంత రానికి వాయిదా పడ్డాయి. కోర్టుల ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 12న, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ 13న, సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ 16న జరగనున్నాయి. దీంతో మరో వారం రోజుల వరకు అందరూ టెన్షన్‌తో గడపాల్సిందే. ముఖ్యంగా ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల టెన్షన్‌తో ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు ఏ పని చేసుకోలేకపోతున్నారని తెలిసింది. ఇంటిపట్టున ఉన్న సమయంలో నేతలు, కార్యకర్తలు రోజూ తమ గెలుపు ఓటముల గురించి చర్చించుకోవడం, టెన్షన్ ను తగ్గించుకునేందుకు కొందరు మద్యం సేవించడం ద్వారా ఆ రోజు గడిపేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు వారం రోజుల గడువు ఉండడంతో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లవారే మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో కొంత ఊరట కలుగుతోందని భావిస్తున్నారు. మరో రెండు రోజులకే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. అయితే కౌంటింగ్‌కు మిగిలిన వారం రోజుల సమయం గడపడం భారంగా మారింది.
విహారయాత్రలతో రిలీఫ్..
ఎన్నిక ల్లో పోటీచేసిన అభ్యర్థులు కొందరు విహారయాత్రలకు వెళ్లినట్టు తె లిసింది. వేసవి ఎండలు ఎక్కువగా ఉండడంతో కొందరు గోవా, ఊటీకి, ఆర్థికంగా ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లినట్టు సమాచారం. మరికొందరు విహారయాత్రలకు వెళ్లడానికి ప్రిపేర్ అవుతున్నారు. కొందరు నేతలు, కార్యకర్తలు వారివారి కుటుంబసభ్యులతో కలిసి దేవాలయాల దర్శనాలకు ప్లాన్ చేసుకున్నారు. ఇంకొందరు బంధువుల ఇళ్లకు తిరుగుతున్నారు. మొత్తమ్మీద ఫలితాల టెన్షన్ అందరినీ వెన్నాడుతోంది. గెలుస్తామో, ఓడుతామో తెలియని పరిస్థితుల్లో చాలామంది నేతలు, అభ్యర్థులు కౌంటింగ్ సమయం దగ్గర పడేదాక స్థానికంగా ఉండకూడదనే భావనతో టూర్లకు వెళుతున్నారు. ఫలితాలు ఎవరిని ముంచుతామో.. ఎవరిని గట్టెక్కిస్తాయో వేచి చూడాల్సిందే.
టెన్షన్.. టెన్షన్
Published Mon, May 5 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement
Advertisement